Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 29 October 2020

అదే జరిగితే పాక్ సైన్యాన్ని నామరూపాల్లేకుండా చేద్దామనుకున్నాం: ఐఏఎఫ్ మాజీ చీఫ్

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్థాన్‌ సైన్యం దుస్సాహసానికి ఒడిగట్టింది. అయితే, పాక్ ప్రయత్నం విజయవంతమై ఉంటే.. వారి సైన్యాన్ని నామరూపాల్లేకుండా తుదముట్టించాలని భావించామని నాటి వైమానిక దళాధిపతి బి.ఎస్‌.ధనోవా తెలిపారు. ఇందుకు భారత సేనలు అప్పటికే సిద్ధమయ్యాయని వెల్లడించారు. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌‌ను అప్పగించడానికి పాక్ నేతలు వణికిపోయారని వచ్చిన వార్తల నేపథ్యంలో ధనోవా స్పందించారు. వర్ధమాన్‌ను అప్పగించడం తప్ప అప్పుడు పాక్‌కు మరో మార్గం లేదని అన్నారు. దౌత్యపరంగా, రాజకీయంగా పాకిస్థాన్‌పై విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొందని పాక్‌ నిస్సహాయతను ఆయన వివరించారు. అలాగే, సైనికపరంగానూ భారత సన్నద్ధత ఎంత ప్రమాదకరమో పసిగట్టారని తెలిపారు. నాడు భారత సైన్యం సామర్థ్యం గురించి తెలిసే పాక్‌ నాయకుల కాళ్లు వణికి ఉంటాయని పరోక్షంగా ఆ దేశ ప్రతిపక్ష నేత ఆయాజ్ సాదిఖ్ వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ అన్నారు. బాలాకోట్‌ వైమానిక దాడుల తర్వాత పాక్‌ చేసిన దుస్సాహసంలో ఏ ఒక్క భారత స్థావరం దెబ్బతిన్నా.. పాక్‌ స్థావరాల్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు సిద్ధమయ్యామని పేర్కొన్నారు. ‘నేను, అభినందన్ తండ్రి కలిసి ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ కోర్సును పూర్తిచేశాం.. అభినందన్ పట్టుబడినప్పుడు కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యానికి పట్టుబడి వారి చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఫ్లైట్ కమాండర్ అహుజా ఘటన మదిలో మెదిలింది. అప్పుడు అహుజాను తిరిగి పొందలేకపోయాం.. కానీ, ఖచ్చితంగా అభినందన్‌ తిరిగొస్తాడు’ అని భావించాం అహుజా పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరి నాటి ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తిరస్కరించారు. ఈలోగా పాక్‌ ఆర్మీ చీఫ్ జనరల్‌ బజ్వా సమావేశ మందిరంలోకి వచ్చారు. అప్పుడు ఆయన కాళ్లు వణుకుతూ శరీరమంతా చెమటలు పట్టి ఉంది. చర్చల అనంతరం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మొహమూద్‌ ఖురేషీ మాట్లాడుతూ.. మీకు పుణ్యముంటుంది.. అభినందన్‌ను వదిలేయండి .. లేదంటే ఇదే రోజు రాత్రి 9 గంటలకు భారత్ మనపై దాడి చేయడానికి సిద్ధమవుతోంది అన్నారు.’ అని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌) నేత, ఎంపీ అయాజ్‌ సాదిఖ్ నాటి సంఘటనను పార్లమెంటులో వెల్లడించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2HG3yaK

No comments:

Post a Comment