Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 30 October 2020

తూచ్.. నా మాటల్ని వక్రీకరించారు.. ‘పుల్వామా’పై పాక్ మంత్రి యూటర్న్

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం అంటూ పార్లమెంట్ సాక్షిగా పాక్ మంత్రి ఫవార్ చౌధురి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో దాయాది మళ్లీ యూటర్న్ తీసుకుంది. ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని పాక్‌ మంత్రి ఫవాద్‌ చౌధురి మాటమార్చడం గమనార్హం. తర్వాత పరిస్థితుల గురించే తాను ప్రస్తావించానంటూ బుకాయించారు. పుల్వామా ఉగ్రదాడి వెనుక హస్తం ఉందని భారత్‌ వాదిస్తుండగా.. దాయాది మాత్రం మాకెలాంటి సంబంధం లేదని మభ్యపెడుతూ వచ్చింది. అయితే, తాజాగా ఈ ఘటనపై మంత్రి ఫవాద్‌ చౌధురి పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మేం భారత్‌‌ను దాని గడ్డపైనే కోలుకోని దెబ్బ తీశాం. ఇది గొప్ప విజయం. పుల్వామాలో మేం సాధించిన విజయం ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని ప్రజలందరి విజయం. మీరు, మేం.. అందరం ఆ విజయంలో భాగం.’ అని ఫవాద్‌ అన్నారు. వింగ్ కమాంర్ అభినందన్‌ విడుదలకు ముందు పాక్‌ అగ్ర నాయకత్వం కాళ్లు వణికాయన్న విపక్ష నేత సాదిఖ్‌ వ్యాఖ్యలకు బదులిస్తూ ఫవాద్‌ ఈ విధంగా పేర్కొన్నారు. ఫవాద్‌ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో తీవ్ర దుమారం రేగడంతో నోరు జారినట్లు గ్రహించిన ఆయన వెంటనే నాలుక్కరుచుకున్నారు. ‘పుల్వామా ఘటన తర్వాత భారత భూభాగంలోకి వెళ్లి మరీ దాడి చేశాం’ అంటూ మాట మార్చారు. ఆ తర్వాత ట్విటర్‌ వేదికగా స్పందించిన ఫవాద్‌.. ‘నా ప్రకటనపై స్పష్టత ఉంది. పుల్వామా తర్వాత భారత్‌తో జరిగిన వైమానిక దాడి గురించే నేను పరోక్షంగా ప్రస్తావించాను. అమాయకులను చంపి మేం ధైర్యవంతులమని నిరూపించుకోవాలనుకోవడంలేదు. ఉగ్రవాదాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే జరగాల్సినదంతా జరిగిపోయింది. పాక్ కుటిల నీతి మరోసారి ప్రపంచానికి తేటతెల్లమయ్యింది. అభినందన్‌ను అప్పగించిన అంశంపై ప్రతిపక్షాలు ఇమ్రాన్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ విమర్శలకు బదులిచ్చే క్రమంలో పాక్ మంత్రి ఫవాద్ తాజా ప్రకటన చేసి నిజాన్ని అంగీకరించారు. విపక్షాల ఉచ్చులోపడి పాక్ అధినేతలు పుల్వామా విషయంలో కుట్రలను బయటపెట్టారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3jAiWSQ

No comments:

Post a Comment