Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 29 October 2020

మోదీ నినాదాలతో దద్ధరిల్లిన పాక్ పార్లమెంట్.. అసహనంతో ఊగిపోయిన విదేశాంగ మంత్రి!

భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుకూల నినాదాలతో పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ మార్మోగింది. ఫ్రాన్స్ ఉత్పత్తుల బహిష్కరణ గురించి పాక్ విదేశాంగ మంత్రి ప్రసంగిస్తుండగా ఆ ప్రాంత ఎంపీలు భారత్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ పదే పదే అడ్డుతగిలారు. ఆయనకు సహనం నశించి ఆగ్రహంతో ఊగిపోయినా వారు మాత్రం తమ నినాదాలను కొనసాగించారు. దీంతో చేసేది ఏమీలేక మంత్రి తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. బలూచ్ ఉద్యమం గురించి పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ సభలో ప్రసంగిస్తుండగా ఆ ప్రాంత ఎంపీలు అడ్డుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని వేనోళ్ల పొగుడుతూ ఖురేషీ సహనాన్ని పరీక్షించారు. ఆ ఎంపీలు మోదీ, మోదీ అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో ఖురేషీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బలూచిస్థాన్ ఎంపీల మనసుల్లోకి మోదీ భావనలు చొరబడినట్టున్నాయని, భారత అజెండాను విపక్ష సభ్యులు పాక్‌లో అమ్ముతున్నారని మండిపడ్డారు. భారత అనుకూల నినాదాలతో జాతీయ సంస్థలను అవమానానికి గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. విపక్షసభ్యుల నియోజకవర్గాల నుంచి బలూచ్ స్వాతంత్ర్యం కోసం నినాదాలు రావడం సిగ్గుచేటు విమర్శించారు. అయినా సరే బలూచిస్థాన్ ఎంపీలు ఖురేషీకి పదేపదే అడ్డుతగలడంతో ఖురేషి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. విపక్ష సభ్యుడు, పీఎంఎల్-ఎన్ నేత ఖ్వాజా అసిఫ్‌పై ఖురేషీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ వైఖరిని ఖండిస్తూ ఆయనకు వ్యతిరేకంగా పాక్ పార్లమెంట్ ఓ తీర్మానం ఆమోదించింది. భావ ప్రకటన స్వేచ్ఛ గురించి బోధిస్తూ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కార్టూన్‌ను ప్రదర్శించిన టీచర్ ఫ్రాన్స్‌లో దారుణ హత్యకు గురయ్యారు. దీంతో అక్కడ మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్లను రెస్టారెంట్లు, పలు వేదికలపై ప్రదర్శిస్తున్నారు. దీనిని మెక్రాన్ ఖండించకపోగా.. వారికి మద్దతుగా మాట్లాడటంపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని నిరసిస్తూ పాక్ పార్లమెంటులో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ మాట్లాడుతూ మధ్యలో బలూచిస్థాన్ ప్రస్తావన తీసుకువచ్చారు. దాంతో బలూచిస్థాన్ ప్రాంత ఎంపీలు రెచ్చిపోయి మంత్రి ప్రసంగాన్ని రసాభాస చేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2JdVVZj

No comments:

Post a Comment