Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 29 October 2020

ఫ్రాన్స్: చర్చిలోకి చొరబడి కత్తితో దాడిచేసిన ఉగ్రవాది.. ముగ్గురు మృతి

ఫ్రాన్స్‌లో ఆగంతకుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నీస్ నగరంలోని ఓ చర్చిలోకి కత్తితో చొరబడిన ఆగంతకుడు ముందుగా ఓ మహిళను దారుణంగా నరికేశాడు. తర్వాత మరో ఇద్దరిపై దాడికి పాల్పడ్డాడు. నిందితుడు ‘అల్లాహ్ అక్బర్’అంటూ అరిచినట్టు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. అతడిని ఉగ్రవాదిగా అనుమానిస్తున్నారు. నీస్ మేయర్ క్రిస్టియన్ ఎస్ట్రోసి దీనిని ఉగ్రదాడిగా పేర్కొన్నారు. నగరంలోని నోట్రే డామే చర్చ్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని, దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. నిందితుడు ‘అల్లాహ్ అక్బర్’లేదా గాడ్ ఈజ్ గ్రేట్ అని బిగ్గరగా అరిచాడని అన్నారు. ‘దుండుగుడి దాడిలో చర్చ్ వార్డెన్ ప్రాణాలు కోల్పోయాడు.. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా నిందితుడు అల్లాహ్ అక్బర్ అంటూ నినాదాలు చేశాడు.. నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసుల అతడిపై కాల్పులు జరిపారని, ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో ఉన్నాడు’ఎస్ట్రోసి తెలిపారు. అంతేకాదు, ‘జరిగిందేదో జరిగిపోయింది.. మా భూభాగం నుంచి ఇస్లామో-ఫాసిజాన్ని ఖచ్చితంగా వెళ్లగొట్టడానికి ఫ్రాన్స్ శాంతి చట్టాలకు విముక్తి పొందే సమయం ఆసన్నమైంది’అని పేర్కొన్నారు. కాగా, ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరి కొందరు గాయపడ్డారని పోలీసులు ధ్రువీకరించారు. ఓ మహిళ తలనరికాడని పేర్కొన్నారు. నిందితుడు ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడటంతో చర్చిలోని వారంతా భయంతో పరుగులు తీశారు. ఎదురుగా ఉన్న బార్‌లోకి కొందరు వెళ్లి తలదాచుకున్నారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ తీవ్రవాద వ్యతిరేక విభాగం విచారణకు ఆదేశించింది. ఇటీవల మహమ్మద్ ప్రవక్తపై వ్యంగ్య కార్టూన్లు ప్రదర్శించిన ఫ్రాన్స్ టీచర్ శ్యామ్యూల్ ప్యాటీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఫ్రాన్స్‌లో ఇస్లాంకి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్లను రెస్టారెంట్లు, పలు వేదికలపై ప్రదర్శిస్తున్నారు. వీటికి అధ్యక్షుడు ఇమ్యానుయేల్ మెక్రాన్ కూడా మద్దతు తెలపడం గమనార్హం.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/31OXLq0

No comments:

Post a Comment