
ప్రముఖ ఆన్‌లైన్ యాప్‌లో సెకండ్ హ్యాండ్ వాహనాల ప్రకటనలను చూసి వాహన యజమానులకు ఫోన్ చేస్తాడు. తనకు బైక్ కావాలని.. కొంటానని నమ్మించి వారిని కలుస్తాడు. టెస్ట్ డ్రైవ్ చేస్తానంటూ బైక్ తీసుకుని ఉడాయిస్తాడు. ఇలా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడుకి చెందిన ఇద్దరు వ్యక్తులు, మురకంబట్టుకు చెందిన మరో వ్యక్తి తమ బైక్‌లు అమ్ముతామంటూ ఆన్‌లైన్ యాప్‌లో పోస్ట్ చేశారు. ఆ ప్రకటన చూసిన జిల్లాలోని యాదమరి మండలం సామిరెడ్డిపల్లెకు చెందిన పవన్ కుమార్ బైకులు కొంటానని వారికి ఫోన్ చేసి నమ్మించాడు. వారితో ఒప్పందం కుదుర్చుకుని టెస్ట్ డ్రైవ్ చేస్తానంటూ బైక్ తాళం అడిగి తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. అలా ముగ్గురి వద్ద నుంచి టెస్ట్ డ్రైవ్ పేరుతో వాహనాలు తస్కరించి ఉడాయించాడు. Also Read: బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు నిఘా పెట్టారు. బైకులతో పరారవుతున్న యువకుడిని పవన్‌గా గుర్తించారు. నిందితుడు ఇరువారం సమీపంలోని బాలాత్రిపురసుందరి దేవి ఆలయం వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ఖరీదైన బైకులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు. Read Also:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37M2Raq
No comments:
Post a Comment