
వృద్ధుల్లో వంటి వ్యాధులపై పోరాడటంలో బీసీజీ వ్యాక్సిన్ సహకరిస్తున్నట్టు భారత వైద్య పరిశోధన మండలి () అధ్యయనంలో వెల్లడయ్యింది. వృద్ధుల్లో మెమెరీ సెల్ ప్రతిస్పందనలు, మొత్తం యాంటీబాడీలు ఉత్పత్తి పెంచడంలో ఈ టీకా ఉపకరిస్తుందని పరిశోధకులు తెలిపారు. జులై నుంచి సెప్టెంబరు మధ్య మొత్తం 60ఏళ్లు పైబడి 86 మంది వృద్ధులపై ఈ అధ్యయనం సాగింది. వీరిలో 54 మందికి టీకా ఇచ్చి, 32 మందికి ఇవ్వకుండా పరిశీలించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిని నెల రోజుల తర్వాత పరిశీలించగా ఆరోగ్యకరమైన వ్యక్తులలో సహజ, అనుకూల రోగనిరోధకశక్తిని పెంచుతుందని గుర్తించారు. బీసీజీ టీకా మెరుగైన సహజ, అనుకూల మెమరీ సెల్స్‌తోపాటు వృద్ధులలో మొత్తం యాంటీబాడీ స్థాయిలతో సంబంధం కలిగి ఉంది.. ఇది SARS-CoV2 వ్యాప్తిని అడ్డుకోడానికి సహకరిస్తుందని సూచిస్తుంది అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బీసీజీ టీకా వినియోగం వల్ల వంటి వ్యాధులపై పోరాడటానికి వృద్ధుల్లో సామర్ధ్యాన్ని పెంచుతుందని ఐసీఎంఆర్ సీనియర్ ఎపిడిమియాలజిస్ట్, చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సమిరన్ పండా అన్నారు. కోవిడ్-19 వల్ల తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న వృద్ధులను కాపాడటానికి ఈ పరిశోధన ఆశలను రేకెత్తిస్తోందన్నారు. దీనిపై ఒకసారి సమీక్షించినట్టయితే, కోవిడ్ -19కు వ్యతిరేకంగా ప్రపంచ పోరాటానికి ఖచ్చితంగా ప్రధాన సహకారం అవుతుందని పండా పేర్కొన్నారు. యాంటీబాడీ (సెరోలజీ) లేదా పిసిఆర్ పరీక్షల ద్వారా సార్స్-కోవి2 పాజిటివ్‌గా నిర్దారణ అయిన వృద్ధులు; HIV- సోకిన వ్యక్తులు; అవయవ మార్పిడి రోగులు; డయాలసిస్ లేదా యాంటీ సైకియాట్రిక్ ఔషధాలు తీసుకుంటున్నవారు; అధ్యయనానికి ఆరు నెలల ముందు టీబీతో బాధపడుతున్నవారిని ఇందులో భాగస్యాములను చేయలేదు. వృద్ధులతో సంబంధం ఉన్న మునుపటి అధ్యయనాలు బీసీజీ టీకా శ్వాసకోశ వ్యాధుల నుంచి రక్షించినట్టు తేలింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/34DEZni
No comments:
Post a Comment