Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 22 December 2020

సిస్టర్ అభయ హత్య కేసు.. దోషులకు జీవితఖైదుతో సహా భారీ జరిమానా విధించిన కోర్టు

దాదాపు మూడు దశాబ్దాల కిందట కేరళలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఫాదర్ థామస్ కొట్టూర్, క్రైస్తవ సన్యాసిని సెఫేలను దోషులుగా నిర్ధారించింది. తాజాగా, దోషులకు బుధవారం శిక్షలను ఖరారు చేసింది. దోషులకు యావజ్జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రధాన దోషి థామస్ కొట్టూరుకు రెండు జీవిత ఖైదులు సహా రూ.6 లక్షల జరిమానా, నన్ సెఫేకి జీవితఖైదు, రూ.5 లక్షల జరిమానా విధించింది. అలాగే, ఆధారాలను నాశనం చేసినందుకు ఇద్దరికీ మరో ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50వేల జరిమానా విధిస్తున్నట్టు పేర్కొంది. ఈ జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి సనీల్‌కుమార్ స్పష్టం చేశారు. మతబోధకుడిగా ఉన్న ఘోరమైన నేరానికి పాల్పడ్డారని, దోషులను కఠినంగా శిక్షించాలని అంతకుముందు ప్రాసిక్యూషన్ తరఫు లాయర్ వాదించారు. దీనికి థామస్ తరఫు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు వయసు పైబడిందని, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని వాదించారు. ఆయనకు కేన్సర్ సోకిందని మూడో దశలో ఉందని కోర్టుకు తెలియజేశారు. అయితే, డిఫెన్స్ లాయర్ వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. దోషులకు జీవితఖైదు సరైందని అభిప్రాయపడింది. ఇక, హత్య జరిగేనాటికి సిస్టర్ అభయ వయసు 21 ఏళ్లు. ఈ కేసు 28 ఏళ్లపాటు సుదీర్ఘ విచారణ కొనసాగింది. నాలుగేళ్ల కిందటే అభయ తల్లిదండ్రులు చనిపోయారు. సిస్టర్ అభయ 1992 మార్చి 27న కొట్టాయంలోని సెయింట్ పియస్ ఎక్స్ కాన్వెంట్‌ వద్ద ఉన్న ఓ బావిలో శవమై తేలింది. ప్రమాదవశాత్తు సిస్టర్ అభయ బావిలో పడి మరణించి ఉండవచ్చని పోలీసులు తొలుత భావించారు. కానీ మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతెన్‌పురక్కల్ ఇది హత్యగా అనుమానించి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కేసు విచారణను 1993లో సీబీఐకి అప్పగించింది. సిస్టర్ అభయ హత్యకు గురైనట్టు సీబీఐ విచారణలో తేలింది. ఆమె భుజం,కుడి చెవిపై బలమై గాయాలైనట్లు నిర్దారించింది. ఈ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత సెయింట్ పియస్ కాన్వెంట్‌లో అధ్యాపకులుగా పనిచేస్తున్న ఫాదర్ థామస్ కొట్టార్, జోస్ పుత్రుక్కయిల్‌తో పాటు మరో క్రైస్తవ సన్యాసిని సెఫేలను 2008లో సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ చార్జిషీట్‌ ప్రకారం... మార్చి 27న తెల్లవారుజామున 4.15 గంటలకు సిస్టర్ అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్‌లోకి వెళ్లింది. ఆ సమయంలో ఫాదర్ థామస్, జోస్ పుత్రుక్కయిల్‌‌లు సెఫేతో అభ్యంతరకర రీతిలో కనిపించారు. ఈ విషయం సిస్టర్ అభయ ఎక్కడ బయటపెడుతుందోమోనన్న భయంతో ఆమెపై దాడి చేసి హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని కాన్వెంట్ ప్రాంగణంలోని బావిలో పడేశారు. ఈ కేసులో దోషిగా తేలిసి సెఫే కూడా సిస్టర్ అభయతో హాస్టల్‌లో ఉంటూ, ఇంఛార్జ్‌గా వ్యవహరించారు. తమ కుమార్తెకు న్యాయం జరగాలని చాలాకాలంగా ఎదురుచూసిన అభయ తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితమే మరణించారు. ఎట్టకేలకు 30 ఏళ్ల తర్వాత సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులను నిర్ధారించి శిక్ష ఖరారు చేసింది. సిస్టర్ అభయ కొట్టాయం బీసీఎం కాలేజీలో విద్యాభ్యాసం చేయగా.. ఫాదర్ థామస్ అక్కడ సైకాలజీ లెక్చరర్‌గా పనిచేశారు. తర్వాత కొట్టాయంలోని క్యాథలిక్ డియోసెసి ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37GmgsI

No comments:

Post a Comment