Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 22 December 2020

కశ్మీర్ స్థానిక ఎన్నికలు.. జమ్మూలో పట్టునిలుపుకుని లోయలో ఖాతాతెరిచిన బీజేపీ

జమ్మూ కశ్మీర్‌ జిల్లా అభివృద్ధి మండళ్లకు (డీడీసీలకు) జరిగిన ఎన్నికల్లో ఫరూక్‌ అబ్దుల్లా నేతృత్వంలోని ఏడు పార్టీల కూటమి- పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్‌ డిక్లరేషన్ (పీఏజీడీ) ఆధిక్యత ప్రదర్శించింది. ఈ కూటమి కశ్మీర్‌ లోయలో భారీగా సీట్లు కైవసం చేసుకుని ఆధిక్యాన్ని చాటుకుంది. జమ్మూ ప్రాంతంలో మాత్రం తన పట్టును నిలుపుకుంది. జమ్మూ రద్దుచేసిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో దేశం యావత్తు ఈ ఫలితాలపై ఆసక్తి ప్రదర్శించింది. మొత్తం 20 జిల్లాల్లో డీడీసీలకు గానూ 13 పీఏజీడీ ఖాతాలోకి వెళ్లాయి. మొత్తం 280 డీడీసీలకు ఎన్నికలు నిర్వహించగా పీఏజీడీ 117, బీజేపీ 74 స్థానాల్లో విజయం సాధించాయి. స్వతంత్రులు 40 స్థానాల్లోనూ, కాంగ్రెస్‌ 26 స్థానాల్లోనూ గెలుపొందాయి. పలు చోట్ల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. అధిక స్థానాలను పీఏజీడీ కూటమి చేజిక్కించుకున్నా... 74 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. మొత్తంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కంటే బీజేపీకి కనీసం 16 సీట్లు అధికంగా లభించాయి. అయితే, బీజేపీ గెలుచుకున్న సీట్లలో 99 శాతం జమ్మూ ప్రాంతంలోనివే కావడం గమనార్హం. కానీ, కశ్మీర్ లోయలోనూ బీజేపీ తొలిసారిగా బోణీ కొట్టింది. నవంబరు 28 నుంచి డిసెంబరు 19దాకా ఎనిమిది విడతల్లో ఈ స్థానిక ఎన్నికలు జరిగాయి. మొత్తం 51 శాతం ఓటింగ్‌ నమోదైంది. గుప్కార్‌ సహా ఏ పార్టీ నుంచీ కీలక నేతలు ఈ ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. ప్రచారంపై కఠిన ఆంక్షలు విధించడం కూడా నేతలను ఇళ్లకే పరిమితం చేసింది. కాంగ్రెస్‌తో కలిసి పీఏజీడీ కూటమి 13 జిల్లాలను హస్తగతం చేసుకుంది. జమ్మూలోని ఆరు జిల్లాలు బీజేపీ ఖాతాలో చేరాయి. ఫలితాలు గుప్కార్‌ అలయెన్స్‌కు అనుకూలంగా వచ్చాయని, దీనిని బట్టి జమ్మూ కశ్మీర్‌‌కు ప్రత్యేక హోదా పునరుద్ధరించాలన్న తమ పోరాటం, ఎజెండాలకు ప్రజలు మద్దతు పలికారని ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. ఆర్టికల్‌ 370 రద్దును కశ్మీరీలు పూర్తిగా వ్యతిరేకించారన్న విషయం ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైందని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అనుసరించిన కశ్మీర్‌ విధానం సరైంది కాదని ఈ ఎన్నికల్లో తేలిపోయిందని కాంగ్రెస్‌ నేత చిదంబరం అన్నారు. అయితే బీజేపీ నేత విబోధ్‌ గుప్తా మాత్రం ప్రధాని మోదీ నాయకత్వానికి కశ్మీరీలు పట్టం కట్టారని చెప్పుకొచ్చారు. కశ్మీర్‌లో పీఏజీడీ 72 స్థానాలు, బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించాయి. శ్రీనగర్ జిల్లాల్లో మాత్రం స్వతంత్రులు భారీగా గెలవడంతో ఎవరు అధికారం చేపడతారనేది స్పష్టతలేదు. జమ్మూ ప్రావిన్సుల్లో బీజేపీ 71 సీట్లు గెలిచింది. జమ్మూ, ఉధమ్‌పూర్, సాంబ, కథువా, రేసీ, దోడాలో బీజేపీ.. పూంచ్, రాజౌరి, కిష్టావార్, రాంబన్ జిల్లాల్లో నేషనల్ కన్ఫరెన్స్-కాంగ్రెస్ సత్తా చాటాయి. అయితే, కశ్మీర్‌లో తొలిసారి ఖాతా తెరిచిన బీజేపీ.. మూడుచోట్ల ఎన్‌సీ, పీడీపీ అభ్యర్థులపై విజయం సాధించడం విశేషం.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2KxBurp

No comments:

Post a Comment