Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 22 December 2020

ఆ వ్యాక్సిన్‌వైపే కేంద్రం మొగ్గు.. వచ్చేవారమే అనుమతి!

దేశంలో కరోనా టీకా అత్యవసర వినియోగానికి ఫైజర్, ఆక్స్‌ఫర్డ్, భారత్ బయోటెక్ సంస్థలు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చేవారమే కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా కరోనా టీకాకు డీసీజీఐ అనుమతించనుందని రాయిటర్స్‌కు వెల్లడించాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) అధికారులు అదనపు సమాచారాన్ని కోరడంతో స్థానికంగా ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సమర్పించినట్టు తెలిపాయి. కేంద్రం అనుమతి లభిస్తే ఆక్స్‌ఫర్డ్‌కు అనుమతించిన తొలి దేశంగా భారత్ నిలవనుంది. ఫలితాలను ఇప్పటికే బ్రిటిష్ రెగ్యులేటరీ విశ్లేషిస్తోంది. ప్రపంచంలోనే పెద్ద ఎత్తున టీకాలను భారత్ ఉత్పత్తి చేస్తోంది. వచ్చే నెలలోనే పౌరులకు అత్యవసర వినియోగం కింద టీకాను అందజేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయిన దేశాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న భారత్‌.. టీకాకు ఆమోదం తెలిపితే మహమ్మారిపై పోరాటంలో కీలక పరిణామం అవుతుంది. తక్కువ ధరకే లభ్యంకావడం, రవాణా, సాధారణ రిఫ్రిజిరేటర్‌లోనే భద్రపరచే వెసులుబాటు వంటి కారణాలతో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా టీకాకే ఆల్పాదాయ దేశాలు మొగ్గుచూపుతున్నాయి. ఇక, మూడు ఫార్మ సంస్థలు చేసిన దరఖాస్తులను సీడీఎస్సీఓ డిసెంబరు 9న పరిశీలించింది. అనంతరం మరింత అదనపు సమాచారం అందజేయాలని సీరమ్ సహా మూడు సంస్థలను కోరింది. ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్.. సీడీఎస్సీఓ కోరినట్టు కరోనా టీకా ట్రయల్స్ అదనపు సమాచారాన్ని అందజేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఫైజర్ గురించి సమాచారం కోసం అధికార వర్గాలు నిరీక్షిస్తున్నాయి. అలాగే, భారత్ బయోటెక్ నుంచి కూడా మరింత డేటా రావాల్సి ఉంది. ఆస్ట్రాజెన్‌కా టీకా విషయంలో భారత ఆరోగ్య విభాగం అధికారులు.. బ్రిటిష్ సహచరులతో ప్రత్యక్షంగా సంప్రదింపులు జరుపుతున్నారని, వచ్చే వారం నాటికి ఆమోదం లభిస్తుందని బలమైన సంకేతాలు వెలువడుతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3pl1Dbs

No comments:

Post a Comment