
తన భార్య జీన్స్ వేసుకుని, డ్యాన్స్ చేయలేదని ఆగ్రహించిన ఓ భర్త ఆమె తలాక్ చెప్పాడు. అనంతరం అత్తవారింటికి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌లో చోటుచేసుకుంది. అయితే, చుట్టుపక్కలవారు సకాలంలో స్పందించడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. అతడికి కాపాడిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్‌లోని న్యూ ఇస్లాంనగర్‌కు చెందిన అమీరుద్దీన్ కుమార్తె మహజబీకి ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. హాపుర్ పరిధిలోని పిల్‌ఖువాకు చెందిన అనస్‌కు ఇచ్చిన పెళ్లిచేశారు. అయితే కొన్నాళ్లుగా భార్యను అసన్ వేధింపులకు గురిచేస్తున్నారు. అతడి వేధింపులకు తాళలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఇరువురి మధ్య గొడవలు జరగడంతో పెద్దలు కలగజేసుకుని రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా భర్త తనను జీన్స్ వేసుకోవాలని, డాన్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని మహజబీ ఆరోపించింది. దీంతో అసన్‌ను మందలించిన పెద్దలు, నచ్చజెప్పి ఇంటికి పంపించేశారు. అయితే, రెండు రోజుల కిందట అత్తారింటికి వచ్చిన అనస్ ఆమెకు మూడుస్లారు తలాక్ చెప్పాడు. తరువాత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని గమనించిన చుట్టుపక్కలవారు అతడిపై నీళ్లు పోసి మంటలను ఆర్పేశారు. దీంతో అనస్‌కు ప్రాణపాయం తప్పి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అనస్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2WDVoTV
No comments:
Post a Comment