Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 24 March 2021

దేశంలో మరోసారి 50వేలు దాటిని కోవిడ్ కేసులు.. మహారాష్ట్రలో కొత్త రికార్డ్!

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,364 మందికి కొత్తగా నిర్దారణ అయ్యింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదయిన అత్యధిక కరోనా కేసులు ఇవే కాగా.. ఐదు నెలల తర్వాత దేశంలో 50వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. చివరిసారిగా అక్టోబరు 23న 54,350 కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశంలో తొలి దశలో అత్యధికంగా సెప్టెంబరు 17న 98 వేల పాజిటివ్ కేసులు బయటపడగా.. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు, కోవిడ్ మరణాలు కూడా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు 200కిపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 248 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,60,726కి చేరుకుంది. అక్టోబరు 23 నాటికి దేశంలో 6,86,792 యాక్టివ్ కేసులుండగా.. అప్పటి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 24కి దేశంలో యాక్టివ్ కేసులు దాదాపు నాలుగు లక్షలు (396,889) ఉన్నాయి. మహారాష్ట్రలో బుధవారం రికార్డుస్థాయిలో 31,855 కొత్త కేసులు నిర్ధారణ కాగా.. 95 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారంతో (134) పోల్చితే ఈ సంఖ్య తక్కువే. ఆ రాష్ట్రంలో 2.5 లక్షల యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. ముంబయిలోనూ పాజిటివ్ కేసులు పెరగడంతో మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. జుహూ బీచ్ సహా ప్రముఖ ప్రాంతాలను మూసివేసింది. నిత్యావసరాల దుకాణాలను కూడా సాయంత్రం 7.00 గంటల్లోపు మూసివేయాలని ఆదేశించింది. గుజరాత్‌లోనూ 1,790 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, గుజరాత్ సహా మొత్తం 19 రాష్ట్రాల్లో జనవరి తర్వాత భారీగా పెరుగుతున్నట్టు కేంద్రం తెలిపింది. బుధవారం కర్ణాటక (2,290)లో నవంబరు 11 తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఏపీలో డిసెంబరు 9 (585) తర్వాత, ఢిల్లీలో (1,254) డిసెంబరు 18 తర్వాత, తమిళనాడు (1,636) నవంబరు 22 తర్వాత అధిక కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది. యూపీలో 737, బెంగాల్‌లో 462, ఒడిశాలో 170, రాజస్థాన్ 669, చత్తీస్‌గఢ్ 2,106, తెలంగాణ 431, హరియాణా 981, బిహార్ 170, మధ్యప్రదేశ్ 1,712, జమ్మూ కశ్మీర్ 195, ఝార్ఖండ్ 194, ఉత్తరాఖండ్ 200, హిమాచల్ ప్రదేశ్ 166, పుదుచ్చేరి 125, చండీగఢ్ 249 కేసులు నమోదయ్యాయి.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/31tQhbD

No comments:

Post a Comment