రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం రాష్ట్రపతిని ఎయిమ్స్‌కు పంపించనున్నట్లు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఛాతీలో అసౌకర్యం కారణంగా రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అబ్జర్వేషన్‌లో ఉంచారు. రాష్ట్రపతి ఆరోగ్యంపై శనివారం ఉదయం ఆర్మీ హాస్పిటల్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. మరోవైపు.. బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కోవింద్ కుమారుడితో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ ఆసుపత్రికి వెళ్లి రాష్ట్రపతిని పరామర్శించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3d9KxJf
No comments:
Post a Comment