Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 27 March 2021

‘మహా’ రాజకీయాల్లో ట్విస్ట్.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు పోలీస్ అధికారులు సాయం!

మహరాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తోందని మహావికాస్ అఘాడీ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి మద్దతు ఇవ్వాలని మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ రష్మీ శుక్లా తనను ప్రభావితం చేశారని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేంద్ర పాటిల్ యద్రావ్‌కర్ సంచలన శుక్రవారం వ్యాఖ్యలు చేశారు. తాజాగా, మరో ఎన్‌సీపీకి చెందిన మరో ఇద్దరు క్యాబినెట్ మంత్రులు ఇటువంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. కొంత మంది పోలీస్ అధికారులు స్వతంత్రులు, చిన్న చితకా పార్టీలకు చెందిన 12 మందికిపైగా ఎమ్మెల్యేలను సంప్రదించి దేవేందర్ ఫడ్నవీస్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు మద్దతు ఇవ్వాలని కోరినట్టు ప్రకటించారు. పోలీసుల బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ గతేడాది ఆగస్టు నాటి నివేదికను మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ రష్మీ శుక్లాయే బీజేపీ నేతలకు అందజేశారని మహావికాస్ అఘాడీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నివేదికను కేంద్ర హోం శాఖ కార్యదర్శికి మాజీ ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ గురువారం సమర్పించారు. ఆమె బీజేపీ కోసం పనిచేస్తున్నారని దుయ్యబట్టింది. నివేదిక వ్యవహారంపై సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీతారామ్ కుంతే గురువారం ఓ నివేదిక అందజేశారు. అందులో రష్మీ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు అవకాశాన్ని రాజకీయ కారణాలకు వినియోగించారని తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా.. గతేడాది కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ సీఆర్పీఎఫ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలను పోలీస్ అధికారులు కలిసిన విషయం అధినేత శరద్ పవార్ దృష్టికి అప్పట్లో వచ్చిందని ఇద్దరు మంత్రులు తెలిపారు. ఎన్నికల నాటికి ఎన్‌సీపీలో ఉన్న యద్రావ్‌కర్.. సర్దుబాటులో ఆయన పోటీచేయాలని భావించిన షిరోల్ స్థానాన్ని వేరే పార్టీకి అప్పగించారు. దీంతో ఆయన ఎన్‌సీపీ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 30వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ‘ఫలితాల తర్వాత తనతో మాట్లాడిన రష్మీ శుక్లా.. కార్యాలయానికి ఆహ్వానించారు.. అప్పటికి తాను స్వతంత్ర ఎమ్మెల్యేగానే ఉన్నారు. బీజేపీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని దూత ద్వారా రాయబారం పంపారు.. ఆమెను నేరుగా కలవకపోయినా ఈ ప్రతిపాదనను తిరస్కరించాను.. నాకు మంత్రి పదవిపై వ్యామోహం లేదని చెప్పాను.. కానీ ఓటర్ల అభిప్రాయానికి కట్టుబడి ఉంటాను.. తాను శివసేనలో చేరాలని వారు కోరుకోవడంతోనే ఆ పార్టీలో చేరాను’ మంత్రి యాద్రావ్‌కర్ అన్నారు. ఆ ఘటన తర్వాత ఎన్‌సీపీ అప్రమత్తమయ్యిందని, తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న ఓ ఐపీఎస్ అధికారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాడటం ఎమ్మెల్యేలను సంప్రదించడం దురదృష్టకరమని పేరు చెప్పడానికి నిరాకరించిన మరో ఎన్సీపీ మంత్రి వ్యాఖ్యానించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/31lWbLx

No comments:

Post a Comment