Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 27 March 2021

తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో హోలీ వేడుకలు నిషేధం.. ఏపీలో మాత్రం..

వ్యాప్తి మరోసారి శరవేగంగా పెరుగుతుండటంతో దాని ప్రభావం హోళీ పండుగపై పడింది. కరోనా నేపథ్యంలో హోళీ వేడుకలను పలు రాష్ట్రాలు నిషేధించాయి. దేశంలో మార్చి 28, 29 తేదీల్లో హోలీ పండుగను జరుపుకోనున్నారు. అయితే, ఇదే సమయంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దీంతో అనేక రాష్ట్రాలు హోలీ వేడుకలకు అనుమతించడం లేదు. ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, వేడుకలపై తెలంగాణ ఆంక్షలు విధించింది. వేడుకలకు అనుమతులు లేవని, ఆంక్షలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గేటెడ్ కమ్యూనిటీల్లో జరుపుకునే వేడుకలపై దృష్టి సారించామని పోలీసులు తెలిపారు. ఈవెంట్ ఆర్గనైజర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వేడుకలకు ప్రభుత్వం అనుమతించింది. కానీ, కోవిడ్ నిబంధనలకు లోబడి వేడుకలను జరుపుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు కర్ణాటక, రాజస్థాన్, హరియాణా, మధ్యప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఢిల్లీ రాష్ట్రాల్లో హోలీ వేడుకలను నిషేధించారు. మహారాష్ట్ర విషయానికి వస్తే ముంబై, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నిషేధం ఉంది. 20 మంది కంటే ఎక్కువ గుమికూడవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. హోలీ వేడుకలకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరని, అనుమతి లేకుండా హోలీ నిర్వహిస్తే ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెడతామని యూపీ వార్నింగ్ ఇచ్చింది. ఇండోర్ నగరంలో ఆది, సోమవారాలు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాజస్థాన్, హరియాణా, కర్ణాటక ప్రభుత్వాలు హోలీతోపాటు, షహబ్ ఇ బరాత్, ఉగాది, గుడ్ ఫ్రైడే సహ ఇతర పండుగలను ఇంట్లోనే జరుపుకోవాలని సూచించాయి. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో వేడుకలను నిషేధిస్తున్నట్టు పేర్కొన్నాయి. మరిన్ని రాష్ట్రాలు కూడా నిషేధం విధించే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ‘హోలీ, షహబ్ ఈ బరాత్‌కు సంబంధించిన వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో జరుపుకోవడం మార్చి 28,29 తేదీలలో నిషేధం.. బహిరంగ వేడుకలు లేదా బహిరంగ ప్రదేశాల్లో జనం గుమిగూడి వేడుకలు నిర్వహించడం నిషేధం.. వీటిని అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని’ రాజస్థాన్ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3fjR6vu

No comments:

Post a Comment