Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 23 March 2021

మీ జాతకం మా చేతుల్లో ఉంది.. గుట్టు విప్పుతాం: ఉద్ధవ్ సర్కారుపై ఫడ్నవీస్ సంచలన వ్యాాఖ్యలు

హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ చేసిన అవినీతి ఆరోపణలు మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహావికాస్ అఘాడీ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఎదురుదాడి మరింత తీవ్రం చేసింది. తాజాగా, ఉద్ధవ్ సర్కారుపై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోంమంత్రిని కాపాడుకునే క్రమంలో మహా వికాస్ అఘాఢీ (ఎంవీఏ) ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకుందని ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఉద్ధవ్ సర్కార్ బండారం బయటపెడతామని మాజీ సీఎం హెచ్చరించారు. ‘‘మహారాష్ట్ర పోలీస్ శాఖలో ఐపీఎస్, నాన్-ఐపీఎస్ అధికారుల బదిలీల రాకెట్‌కి సంబంధించిన కీలక పత్రాలు, కాల్ రికార్డింగులు మా వద్ద ఉన్నాయి. ఈ డేటాను త్వరలోనే ఢిల్లీ వెళ్లి, కేంద్ర హోంశాఖ సెక్రటరీకి అందజేసి సీబీఐ విచారణ కోరతామని అన్నారు’’ అని ఉద్ఘాటించారు. ‘‘బదిలీ రాకెట్’’‌కి సంబంధించి తన వద్ద మొత్తం 6.3 జీబీ డేటా ఉందని ఆయన అన్నారు. ‘‘పోలీస్ అధికారుల బదిలీ రాకెట్‌‌కి సంబంధించి అనుమానితుల కాల్ రికార్డులను ఆగస్టు 20న మహారాష్ట్ర డీజీపీకి ఇంటిలిజెన్స్ కమిషనర్ పంపారు. తర్వాత వాటిని ముఖ్యమంత్రికి అందజేశారు.. వీటిపై ఆయన కొంత ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. జీఏడీ ద్వారా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దంటూ అడ్డుకున్నారు’ అని ఫడ్నవీస్ ఆరోపించారు. బదిలీల రాకెట్ వ్యవహారం తన నోటీసుకు వచ్చినా ప్రభుత్వాన్ని కాపాడుకోడానికే ఉద్ధవ్ ప్రాధాన్యత ఇచ్చారని దుయ్యబట్టారు. ‘ముఖ్యమంత్రి జీఏడీ బాధ్యతలను నిర్వర్తించినప్పటికీ నివేదికపై ఎటువంటి చర్య తీసుకోలేదు.. కేంద్ర హోం శాఖ కార్యదర్శి దీనికి సంరక్షకుడు కాబట్టి నేను నివేదికను ఆయనకు సమర్పిస్తాను’అని తెలిపారు. ఫిబ్రవరి ద్వితీయార్థంలో తాను కరోనా వల్ల క్వారంటైన్‌లో ఉన్నానంటూ హోంమంత్రి చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని ఫడ్నవిస్ అన్నారు. వీఐపీల కదలికలపై పోలీసుల వద్ద ఉన్న రికార్డుల ప్రకారం... హోంమంత్రి ఫిబ్రవరి 17న సహ్యాద్రి గెస్ట్ హౌస్‌కి, ఫిబ్రవరి 24న మంత్రాలయానికి వెళ్లారని ఆయన పేర్కొన్నారు. ‘‘ఫిబ్రవరి 15 నుంచి 27 వరకు ఆయన హోం క్వారంటైన్‌లోనే ఉన్నప్పటికీ.. అధికారులను తరుచూ కలుసుకుంటున్నారు. ఆయన ఐసోలేషన్‌లో లేరు. ఆయనకు నిన్న శరద్ పవార్ సరిగ్గా చెప్పలేదనుకుంటా..’’ అంటూ ఎద్దేవా చేశారు. కొవిడ్ కారణంగా ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు హోంమంత్రి దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో ఉన్నారంటూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిన్న కొన్ని ఆస్పత్రి డాక్యుమెంట్లు చూపించిన విషయం తెలిసిందే. మూడు ప్రభుత్వాల కింద ఇంటెలిజెన్స్ కమిషనర్ హోదాలో పనిచేసిన రష్మీ శుక్లా మంచి ట్రాక్ రికార్డ్ ఉందని, ఆ అధికారి బయటపెట్టిన బదిలీ రాకెట్‌‌ను తప్పుపట్టలేమని అన్నారు. ‘రష్మీ శుక్లా సీనియర్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ పదోన్నతి విషయంలో పక్కనబెట్టి ఆమెను ప్రాధాన్యత లేని పౌర భద్రత విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా నియమించారు.. మరోవైపు, పైరవీలు చేసినవారికి కోరుకున్న పోస్టులు వచ్చాయి’ అని అన్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/392RRoX

No comments:

Post a Comment