
కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కేంద్రం మరో శుభవార్త అందించింది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ అందించనున్నట్లు వెల్లడించింది. మంగళవారం (మార్చి 23) సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఢిల్లీలో మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని ఆయన తెలిపారు. భారత్‌లో కొవిడ్ టీకాల కొరత లేదని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకునే విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు. దేశంలో ఇప్పటివరకు 4.85 కోట్ల మందికి ఇచ్చినట్లు మంత్రి జవదేకర్ తెలిపారు. 80 లక్షల మంది వ్యాక్సిన్ రెండో డోసును కూడా తీసుకున్నారని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 32 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పారు. Must Read: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో సారి విజృంభిస్తున్న నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్ విధించే ఆలోచన ఏదైనా ఉందా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఏదీ లేదని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఆ అప్‌డేట్ కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కే.. కొవిషీల్డ్ రెండో డోసును 6 నుంచి 8 వారాల మధ్య ఇవ్వాలని సూచించినట్లు ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. శాస్త్రవేత్తలు, ప్రపంచ శాస్త్రవేత్తల బృందాల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇది COVISHIELD టీకాకు మాత్రమేనని తెలిపారు. 45 ఏళ్లు పైబడిన వారందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు. అది కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా కవచాన్ని (Shield) అందిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు.. యువతకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మొదటి విడతలో భాగంగా కరోనా వారియర్స్ (డాక్టర్లు, వైద్య, ఆరోగ్య సిబ్బంది)కు, రెండో విడతలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. Also Read: ✦ ✦
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3sd1cSI
No comments:
Post a Comment