Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 23 March 2021

అతిగా మద్యం సేవించి చనిపోతే బీమా పరిహారం హుళుక్కే.. సుప్రీం సంచలన తీర్పు

మద్యపానానికి బానిసలుగా మారి చనిపోయిన వ్యక్తుల బీమా పరిహారం విషయంలో సంచలన తీర్పు వెలువరించింది. అతిగా మద్యం సేవించి చనిపోయిన వ్యక్తి వారసులకు బీమా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని ఓ కేసుకు సంబంధించి తీర్పు చెప్పింది. ప్రమాదంలో మరణిస్తే తప్ప ఇతర సందర్భాల్లో పరిహారం ఇవ్వాల్సిన పనిలేదని జస్టిస్‌ ఎం.ఎం. శాంతన్‌ గౌండర్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. ఈ విషయమై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ 2009 ఏప్రిల్ 24న ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ తీర్పులో జోక్యం చేసుకోడానికి తమకు ఎటువంటి సహేతుక కారణాలు కనిపించడంలేదని పేర్కొంది. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన నర్బదా దేవి అనే మహిళ జాతీయ వినియోగదారుల కమిషన్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిమ్లా జిల్లాలోని చోపాల్‌ పంచాయతీకి చెందిన నర్బదాదేవి భర్త ఆ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్‌లో చౌకీదారుగా పనిచేశాడు. అతడు 1997 అక్టోబరు 7-8 తేదీల మధ్య కురిసిన భారీ వర్షాలు, చలి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు కుటుంబసభ్యులు అధికారులకు సమాచారం అందజేశారు. అయితే పోస్ట్‌మార్టంలో శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, అధికంగా మద్యం సేవించడం వల్ల అతడు చనిపోయినట్టు తేలింది. ప్రమాద మరణం కాకపోవడంతో పరిహారం చెల్లించడానికి బీమా కంపెనీ నిరాకరించింది. దీంతో కుటుంబసభ్యులు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా అక్కడ వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పు బీమా కంపెనీ జాతీయ ఫోరంలో సవాల్ చేసింది. విచారణ జరిపిన జాతీయ .. బీమా కంపెనీ ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని 2009లో తీర్పు వెలువరించింది. కానీ, అతడు పనిచేసి అటవీ సంస్థ మాత్రం పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో నర్బదా దేవి అపీలు చేయగా.. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం.. పాలసీదారు అతిగా మద్యం సేవించడంతో చనిపోయాడని, ఇది ప్రమాద మరణం కాదని వ్యాఖ్యానించింది. కాబట్టి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రెండు సంస్థలకూ లేదని తేల్చిచెప్పింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3rhAnvc

No comments:

Post a Comment