Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 23 March 2021

కరోనా వ్యాక్సిన్‌తో ఆ ప్రమాదమేమీ లేదు..

రోనా వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టే ప్రమాదమేమీ లేదని ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి ప్యానెల్‌ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం రక్తం గడ్డకడుతోందనే ఆందోళనలతో కొన్ని ఐరోపా దేశాలు ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్‌పై ప్రభుత్వ ప్యానెల్ పలు పరిశోధనల సమాచారాన్ని విశ్లేషించింది. అనంతరం భయాలేవీ అవసరం లేదంటూ భరోసా ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా తాము 400కు పైగా దుష్ప్రభావాలను విశ్లేషించామని నేషనల్ అడ్వర్స్‌ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ (AEFI) తెలిపింది. దేశంలో ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన రెండు టీకాల వల్ల అసాధారణ రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం లాంటి కేసులను గుర్తించలేదని పేర్కొంది. కొద్ది రోజుల కిందట ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కమిటీ కూడా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ గురించి సానుకూల వ్యాఖ్యలు చేసింది. కరోనా మరణాలు నివారించడంలో ఆ వ్యాక్సిన్ గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొంది. మరోవైపు.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను తిరిగి వాడనున్నట్లు ఐరోపా దేశాలు ప్రకటించాయి. ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థ ఆస్ట్రాజెనెకా టీకా ‘సురక్షితమైంది, సమర్థమైంది’ అని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ‘కొవిషీల్డ్’ పేరుతో ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్.. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు నిండిన వారందరికీ టీకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 16 నుంచి మొదలైంది. తొలి దశలో పారిశుద్ధ్య కార్మికులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది (కొవిడ్ వారియర్స్)కి ప్రాధాన్యం ఇచ్చారు. మార్చి 1 నుంచి రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ దశలో 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న 45 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇస్తున్నారు. మార్చి 22 నాటికి దేశంలో 4.85 కోట్ల మంది టీకా తీసుకున్నారు. వీరిలో 80 లక్షల మంది రెండో డోసును కూడా తీసుకున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/399c7oN

No comments:

Post a Comment