
కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో వైరస్ వ్యాప్తి పెరుగుతున్న వేళ పాజిటివ్ కేసుల గుర్తింపు, బాధితులకు చికిత్స అందించే విషయంలో వేగం పెంచాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. టెస్టుల సంఖ్య పెంచాలని సూచించింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్ (Test-Track-Treat protocol) ప్రొటోకాల్‌ను అనుసరించాలని నిర్దేశించింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు తాజా మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని కేంద్ర హోం శాఖ మంగళవారం (మార్చి 23) పేర్కొంది. ఆర్టీ పీసీఆర్ (RT-PCR) పరీక్షల సంఖ్యను పెంచాలని కొత్త మార్గదర్శకాల్లో హోం శాఖ సూచించింది. కొత్తగా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను గుర్తించగానే వెంటనే ఐసోలేషన్ లేదా చికిత్స కేంద్రానికి తరలించాలని ఆదేశించింది. తద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని పేర్కొంది. Covid-19: హోం శాఖ మార్గదర్శకాలు..
- పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.
- బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలు పాటించేలా చూడాలి. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3f6wVkx
No comments:
Post a Comment