Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 24 August 2021

అఫ్గన్ పరిస్థితి చూశాక మిమ్మల్ని నమ్మేదెవరు.. అమెరికాపై చైనా ఘాటు వ్యాఖ్యలు

నుంచి తన సైన్యాలను అస్తవ్యస్తంగా ఉపసంహరించుకోవడం అమెరికా ‘స్వార్థపూరిత’ విదేశాంగ విధానానికి ఉదాహరణ అంటూ మంగళవారం చైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆసియా జలాల్లో ఆధిపత్యం కోసం అమెరికా బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. సింగ్‌‌పూర్‌లో పర్యటిస్తున్న మీడియాతో మాట్లాడుతూ.. ఆసియా పట్ల అమెరికా నిబద్ధత.. అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉన్న ప్రాంతీయ మిత్రదేశాలకు భరోసా ఇవ్వడానికి సహకరిస్తోందని అన్నారు. ‘దక్షిణ చైనా సముద్రంలో అధిక భాగం తమదేనని వాదనలు చేస్తున్న చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. బెదిరింపులతో ఆధిపత్యాన్ని రక్షించుకోవడానికి అంతర్జాతీయ నియమాలంటూ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ‘అఫ్గనిస్థాన్‌లో ప్రస్తుత సంఘటనలు అమెరికా మాట్లాడే నియమాలు, విధానాలు ఏమిటో స్పష్టంగా చెబుతున్నాయి’ అని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ‘ఒక సార్వభౌమ దేశంలో అమెరికా సైనిక జోక్యాన్ని ఇష్టపూర్వకంగా నిర్వహించగలదు.. ఆ దేశంలో ప్రజల బాధలకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు’ అని వాంగ్ అన్నారు. ‘మొదట అమెరికాను రక్షించడానికి, ఏకపక్షంగా అణచివేయడం, బలవంతం చేయడం.. ఎటువంటి చెల్లింపులు చేయకుండా ఇతర దేశాలను వేధించడం.. ఇది అమెరికా కోరుకునే విధానం... కానీ ఇప్పుడు వాటిని ఎవరు నమ్ముతారు?’ అని వాంగ్ వెన్బిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అఫ్గనిస్థాన్ నుంచి చైనా సైన్యాలు ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తాలిబన్లతో చైనా లోపాయికారీ సంబంధాలు కొనసాగించింది. తాలిబన్ల ఆక్రమించుకున్న తర్వాత వారికి స్నేహహస్తం అందించడానికి సిద్ధమయ్యింది. అమెరికాను దెబ్బకొట్టాలంటే ఇదే సరైన సమయమని డ్రాగన్ భావించి.. వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. గత నెలలో చైనాలో పర్యటించిన ప్రతినిధులు.. ఆ దేశ విదేశాంగ మంత్రితో భేటీ అయి తమ నుంచి ఎటువంటి ముప్పు ఉండదని హామీ ఇచ్చారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/2UH4lyq

No comments:

Post a Comment