Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 24 August 2021

ఫ్రెండ్ భార్యపై కన్ను.. సెక్స్‌లో పాల్గొనాలని బీజేపీ నేత ఆఫర్.. తగినశాస్తి చేసిన బాధితురాలు!

స్నేహితుడి భార్యపై కన్నేసిన ఓ రాజకీయ నేత.. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆమెను తనతో శృంగారంలో పాల్గొనాలని ఆఫర్ చేసిన నేత.. చివరికి ఆమె చేతిలోనే చెప్పుదెబ్బలు తిన్నాడు. బాధితురాలి భర్త కూడా తన స్నేహితుడితో శృంగారం చేయడానికి అంగీకారం చెప్పడం గమనార్హం. కామాంధుడ్ని బీజేపీ నేతను బాధితురాలు నిలదీయడానికి వచ్చిన సమయంలో అక్కడే ఉన్న ఆమె భర్త.. భార్యకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె అపర కాళికలా మారి స్నేహితుడితో పాటు భర్తకు తగిన శాస్తి చేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బలోదాబజార్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజేపీ సూర్యకాంత్ తమ్రకర్ కొద్ది రోజుల కిందట తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అతడి భార్యను ఎలాగైనా వశం చేసుకోవాలని భావించాడు. తన కోరికను బయటపెట్టడంతో ఆమె సున్నితంగా తిరస్కరించింది. పదిహేను రోజుల తర్వాత మళ్లీ తన కోరిక తీర్చాలని స్నేహితుడి భార్యను కోరాడు. దీంతో అతడికి సరైన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్న ఆమె.. అతడి దుకాణానికి వెళ్లింది. సోమవారం మరో యువతితో కలిసి బీజేపీ కౌన్సిలర్ షాప్‌కు వెళ్లిన ఆమె.. అతడికి మరోసారి చెప్పిచూసింది. వదిన అమ్మతో సమానమని, ఇలా అడగడానికి మనసెలా వచ్చిందని నిలదీసింది. దీనికి వదిన, మరుదుల మధ్య ఇలాంటివి సర్వసాధారణం అని కౌన్సెలర్ ప్రలోభపెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో వెంటనే తన చెప్పు తీసుకుని అతడిని చెంపలు వాయించింది. అక్కడే ఉన్న భర్త ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆమె ఆగ్రహానికి గురికాక తప్పలేదు. భర్తకు ఎడాపెడా వాయించి నేరుగా పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదుచేసిన సిగ్మా పోలీసులు.. ఒకరిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు కౌన్సిలర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇక భార్య పట్ల ఏమాత్రం గౌరవం, బాధ్యత లేని వ్యక్తితో ఇక కాపురం చేయలేనని బాధితురాలు తెలిపింది. ఇంత జరిగినా తన భర్తకు కొంచెం కూడా సిగ్గనిపించడం లేదని, భార్య అంటే కనీస పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త అలా ఉండడం వల్లే బయటి వ్యక్తులు ఇంట్లోకి వస్తున్నారని, ఈరోజుతో తన వైవాహిక బంధం ముగిసిందని ప్రకటించింది. ఈ ఘటనపై ఆమె భర్తను ప్రశ్నించగా.. కౌన్సిలర్ చాలా పెద్దమనిషని, అతడితో స్నేహం కోసం తప్పలేదని చెప్పడం అతడి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3jb2qvu

No comments:

Post a Comment