Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 18 February 2022

పెళ్లాలు మాట వినకపోతే 3 రోజులు దూరంగా పడుకోండి.. అప్పటికీ మారకపోతే..: భర్తలకు మహిళా మంత్రి సలహా!

కాపురం అన్న తర్వాత కలహాలు, కలిసిపోవడం అన్నది భార్యాభర్తల మధ్య సర్వసాధారణం. అయితే, కొందరు మాత్రం విచక్షణ కోల్పోయి చిన్న చిన్న విషయాలకే భార్యలను చిత్రహింసలకు గురిచేస్తుంటారు. వారికి కుటుంబసభ్యులు కూడా వత్తాసు పలుకుతుంటారు. మహిళలపై జరుగుతున్న గృహ హింసను అడ్డుకునేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా మార్పులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వేధింపులకు గురైన మహిళలకు తోటి మహిళలు అండగా నిలుస్తారు. కానీ, ఓ మహిళా మంత్రి మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి వార్తల్లో నిలిచారు. మాట వినకపోతే భార్యలను భర్తలు కొట్టొచ్చని మలేషియాకు చెందిన మహిళా, కుటుంబ, కమ్యూనిటీ అభివృద్ధి డిప్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. మాట వినని, మొండిగా ఉండే భార్యలను కొట్టాలని భర్తలకు ఆమె సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘మొండిగా వ్యవహరించే భార్యలతో మాట్లాడి క్రమశిక్షణగా ఉంచాలి.. అప్పటికీ కూడా భార్యలు తమ ప్రవర్తనను మార్చుకోకపోతే, మూడు రోజులు వారికి దూరంగా పడుకోవాలి.. అయినా భార్యల తీరు మారకపోతే భర్తలు సున్నితంగా కొట్టవచ్చు.. భార్యపై భర్త అతని కఠినత్వాన్ని, ఆమెలో మార్పును ఎంతగా కోరుకుంటున్నాడో చూపించవచ్చు.. భర్తతో మాట్లాడాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి.. భర్తలు భోజనం ముగించి, ప్రార్థన చేసి, విశ్రాంతిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా వారితో మాట్లాడండి’’ అని మహిళా మంత్రి భర్తలకు సలహాలిచ్చారు. రెండు నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంత్రి వ్యాఖ్యలు గృహ హింసను ప్రోత్సహించేలా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సదరు మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరొకర్ని కొట్టే హక్కు ఎవరికీ లేదని ఓ నెటిజన్ అంటే.. మహిళ, పిల్లలను లేదా జంతువును కొట్టడం ఎప్పటికీ ఫర్వాలేదనడం సిగ్గుచేటని మరొకరు వ్యాఖ్యానించారు. ‘‘మలేసియా మహిళలకు ఏంటీ కష్టం..! ఈ విధంగా ఉండే మీకు డిప్యూటీ మినిస్టర్‌గా ప్రాతినిధ్యం వహించడానికి ఎంత ధైర్యం? వెంటనే రాజీనామా చేసి, మహిళల పట్ల శ్రద్ధ వహించే వారికి బాధ్యతలను అప్పగించాలని ఆశిస్తున్నాను’’ అని ఇంకో నెటిజన్ అన్నారు. గృహ హింసను సాధారణీకరించడం సిగ్గుచేటని, ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని మహిళా హక్కుల సంఘం జాయింట్ యాక్షన్ గ్రూప్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ డిమాండ్ చేసింది. మలేసియాలో నేరంగా పరిగణించే గృహ హింసను సాధారణీకరించడానికి, అలాగే లింగ సమానత్వ వ్యతిరేక ఆలోచనలు, ప్రవర్తనలున్న వ్యక్తిని పదవి నుంచి తప్పించాలని కోరింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/pyX7gJu

No comments:

Post a Comment