Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 21 February 2022

కశ్మీర్ సరిహద్దుల్లో అఫ్గన్ సిమ్ కార్డులు.. అమెరికా వదిలేసి వెళ్లిన ఆయుధాలు!

అఫ్గన్ నుంచి గతేడాది ఆగస్టులో వైదొలగిన అమెరికా.. అక్కడ కొన్ని ఆయుధాలను కొన్నింటిని ధ్వంసం చేసినా మిగతావి అలాగే వదిలేసి వెళ్లింది. అయితే, ఈ ఆయుధాలు ప్రస్తుతం పాకిస్థాన్‌ మీదుగా కశ్మీర్‌ సరిహద్దుల వద్దకు చేరుకుంటున్నట్టు సైనిక వర్గాలు పసిగట్టాయి. ఇటీవల కాలంలో అమెరికా వాడిన నైట్‌విజన్‌ సామాగ్రి, ఆయుధాలు కశ్మీర్‌‌లో ఉగ్రమూకల వద్ద ఉన్నట్లు గుర్తించాయి. ఈ విషయాన్ని ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సీనియర్ సైనిక అధికార వర్గాలు వెల్లడించాయి. అఫ్గన్‌ భాష మాట్లాడేవారు తరచూ సరిహద్దులకు అవతలవైపు కనిపిస్తున్నట్లు సీనియర్ ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు అఫ్గన్‌ సిమ్‌కార్డుల సిగ్నల్స్‌ సంఖ్య పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పెరిగిపోయినట్లు గుర్తించారు. ఇటీవల కశ్మీర్‌ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుదారులను మట్టుబెట్టిన ఆర్మీ.. ఎన్‌కౌంటర్ సమయంలో వారి వద్ద , ఇతర పరికరాలు స్వాధీనం చేసుకుంది. అఫ్గనిస్థాన్‌లో అమెరికా దళాలపై దాడుల కోసం వెళ్లిన ఉగ్రవాదులు తిరిగి పీవోకేకు చేరుకొన్నట్లు అంచనావేస్తున్నారు. వీరిని కశ్మీర్‌లోకి పాక్ సైన్యం పంపే అవకాశం ఉందని, ఈ వేసవిలో చొరబడేందుకు ప్రయత్నించవచ్చని సైనిక వర్గాలు భావిస్తున్నాయి. అఫ్గనిస్థాన్‌లో దాదాపు ఆరు లక్షల అత్యాధునిక చిన్న ఆయుధాలను అమెరికా వదిలేసి వెళ్లిపోయింది. వీటితోపాటు వేల సంఖ్యలో నైట్‌విజన్‌ పరికరాలు కూడా వదిలిపెట్టింది. ఇటువంటి ఆయుధాలను పాక్‌ సైన్యం ఉపయోగించదు. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్ల సమయంలో సైన్యం ఇటువంటి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం విశేషం. 19 ఇన్‌ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ చంద్ పూరియా మాట్లాడుతూ.. . అఫ్గనిస్థాన్‌లో అమెరికా దళాలపై దాడుల కోసం వెళ్లిన ఉగ్రవాదులు తిరిగి పీవోకేకు చేరుకున్నారని అన్నారు. వీరిని కశ్మీర్‌లోకి పాక్ సైన్యం పంపే అవకాశం ఉందని, ఈ వేసవిలో చొరబడేందుకు ప్రయత్నించవచ్చని తెలిపారు. నిఘా వర్గాల నివేదిక ప్రకారం నియంత్రణ రేఖ వెంబడి లాంచింగ్ ప్యాడ్‌ల వద్ద 100 నుంచి 130 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘గతేడాది అరడజను చొరబాటు యత్నాలను భగ్నం చేసి, భారీ సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చాం.. వారి దగ్గర అత్యాధునిక ఆయుధాలు, నైట్-విజన్ డివైజ్‌లు, ఆయుధాలు లభించాయి’’ అని అన్నారు. ఆరు లక్షలకుపైగా అత్యాధునిక చిన్న ఆయుధాలు, వేలాది నైట్-విజన్ డివైజ్‌లను అమెరికా వదలివెళ్లిపోయిందని మీడియా నివేదికలు అంచనా వేశాయన్నారు. తాలిబన్లు అధికారంలోకి రావడంతో అమెరికా సైన్యంపై దాడిచేసిన ముష్కరులు పెద్ద సంఖ్యలో అఫ్గన్ నుంచి పాకిస్థాన్‌కు చేరుకున్నాయని తెలిపారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/QNpkaxA

No comments:

Post a Comment