Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 20 February 2022

కేసీఆర్‌కు ఆ సత్తా ఉన్నా.. కాంగ్రెస్ లేని కూటమి సాధ్యం కాదు: సంజయ్ రౌత్

కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌లతో ఆదివారం విడివిడిగా సమావేశమయ్యారు. ఠాక్రేతో మూడు గంటల పాటు, ఆ తర్వాత శరద్‌పవార్‌ నివాసంలో రెండున్నర గంటల పాటు మంతనాలు జరిపారు. ఠాక్రేతో భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించారు. అనంతరం వారిద్దరూ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌లతో కేసీఆర్‌ చర్చల సందర్భంగా కాంగ్రెస్‌ రహిత కూటమి ప్రస్తావన వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ సారథ్యం, భాగస్వామ్యం ప్రతికూలంగా పరిణమిస్తుందని కేసీఆర్‌ చెప్పినట్లు సమాచారం. కూటమి స్థాపన దిశగా చర్యలు చేపట్టి, జాతీయస్థాయి ప్రత్యామ్నాయమనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. అయితే, ఈ ప్రచారాన్ని సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు తీవ్రంగా ఖండించారు. లేకుండా జాతీయస్థాయిలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదని రౌత్ స్పష్టం చేశారు. అంతేకాదు, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సైతం బీజేపీని ఎదుర్కోవడానికి కూటమి ఏర్పాటు అంశంపై మాట్లాడినప్పుడు కూడా కాంగ్రెస్‌ లేకుండా సాధ్యంకాదని శివసేన స్పష్టం చేసిందని ఆయన అన్నారు. ‘‘కాంగ్రెస్ లేకుండా రాజకీయ ఫ్రంట్ ఏర్పడుతుందని మేం ఎప్పుడూ చెప్పలేదు.. బీజేపీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ప్రతిపక్ష ఫ్రంట్‌ను సూచించిన సమయంలోనూ కాంగ్రెస్‌ను వెంట తీసుకెళ్లాలని మొదటి చెప్పిన రాజకీయ పార్టీ శివసేన.. అందరినీ వెంట తీసుకెళ్లి నడిపించే సత్తా కేసీఆర్‌కు ఉంది’’ అని రౌత్ వ్యాఖ్యానించారు. ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్‌ భేటీకి ముందు రోజు శివసేన అధికార పత్రిక సామ్నా తన సంపాదకీయంలో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో కూటమి ఏర్పాటు ప్రయత్నాలు మొదలయ్యాయని పేర్కొంది. మహారాష్ట్రలో ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌తో చర్చల అనంతరం ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. తాము టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తామనే అభిప్రాయాన్ని వెల్లడించారు. కానీ, మహారాష్ట్ర సీఎంవో ట్విట్టర్ ఖాతాలో మాత్రం ‘కేసీఆర్‌తో భేటీ సందర్భంగా పరిశ్రమలు, మౌలిక వసతులు, నీటిపారుదల, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్మాణంలో పరస్పర సహకారం గురించి చర్చించి’నట్లు తెలిపారు. బీజేపీ వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని కేసీఆర్‌కు మహారాష్ట్ర సీఎం చెప్పినట్లు తెలిసింది. ‘శివసేన తొలి నుంచీ బీజేపీకి సహకరించింది. కానీ ఆ పార్టీ ఏ రోజూ శివసేన ఎదుగుదలకు సహకరించలేదు.. గత ఎన్నికల్లో అధికారం మాకే ఇస్తామని చెప్పి మాట మార్చింది.. శివసేన అధికారంలోకి వచ్చాక ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది’ అని వ్యాఖ్యానించినట్టు భోగట్టా.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/e0HXJyl

No comments:

Post a Comment