Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 20 February 2022

భజరంగ్ దళ్ కార్యకర్త హత్యతో శివమొగ్గలో ఉద్రిక్తత.. భారీగా బలగాలు మోహరింపు

కర్ణాటకలోని నగరంలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష (26) ఆదివారం రాత్రి హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను హత్యచేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హర్ష హత్యతో కోపోద్రిక్తులైన భజరంగ్ దళ్ కార్యకర్తలు శివమొగ్గ నగరంలోని సీగేహట్టి ప్రాంతంలో పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనతో శివమొగ్గలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కేసు నమోదచేసి దర్యాప్తు చేపట్టారు. శివమొగ్గ నగరంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మరోవైపు, ఈ హత్య కేసులో ఓ అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. శివమొగ్గలోని భారతి కాలనీ రవిశర్మ వీధిలో ఆదివారం రాత్రి హర్షను దుండగులు పొడిచి దారుణంగా హత్య చేశారు. కారులో వచ్చిన దుండుగులు హర్షను వెంబడించి పదునైన ఆయుధాలతో పొడిచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న హర్షను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అతడు అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. టైలరింగ్ వృత్తి చేసుకుంటున్న హర్ష.. ప్రస్తుతం భజరంగ దళ్ శివమొగ్గ జిల్లా కో-ఆర్డినేటర్‌గా ఉన్నారు. భజరంగ్ దళ్, వీహెచ్‌పీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే హర్ష.. గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నీ తానై వ్యవహరిస్తాడు. ఓ మతాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారనే ఆరోపణలతో హర్షపై దొడ్డపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. అతడికి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. హర్ష హత్య విషయం తెలియడంతో వందల మంది హిందూ సంఘాల కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/5sryuwB

No comments:

Post a Comment