Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 20 February 2022

పుతిన్‌తో చర్చలకు అంగీకరించిన బైడెన్.. కానీ, ఒక్క షరతు!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు చర్చలకు అంగీకరించారు. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయకపోతే మాత్రమే ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతుందని అమెరికా షరతు విధించింది. యుద్ధాన్ని నివారించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఫ్రాన్స్ సోమవారం ప్రకటించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ప్రతిపాదించిన శిఖరాగ్ర సమావేశానికి ఇద్దరు నాయకులు సూత్రప్రాయంగా అంగీకరించారు. బైడెన్ కూడా అంగీకరించినట్టు వైట్‌హౌస్ ధ్రువీకరించింది. వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఎలీసీ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. సమావేశం అజెండా, సమయం నిర్ణయించాల్సి ఉంది కాబట్టి ఇది పూర్తిగా ఊహాత్మకమైంది అని వ్యాఖ్యానించారు. సమావేశానికి సంబంధించి రష్యా, అమెరికా మధ్య గురువారం నుంచి సన్నాహాలు ప్రారంభమవుతాయని ఎలీసీ తెలిపారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర గురించి హెచ్చరికలు, రష్యా అనుకూల వేర్పాటువాదులు, ఉక్రెయిన్ దళాల మధ్య కొనసాగుతున్న కాల్పుల నేపథ్యంలో చర్చలకు ఇరువురూ అంగీకరించడం కొంత ఊరట కలిగించే అంశం. ఉక్రెయిన్ సరిహద్దుల్లో దాడుల భయంతో చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. రష్యాపై దాడి చేస్తే తీవ్రమైన పరిణామాలను విధించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా హెచ్చరించింది. అతి త్వరలో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడికి రష్యా సన్నాహాలు కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోందని అమెరికా ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ చెప్పారు. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో సైనికులు, రష్యా మద్దతున్న తిరుగుబాటుదారుల మధ్య భీకర పోరు జరుగుతోంది. ఆదివారం ఇక్కడ వేలాది ఫిరంగి గుళ్లు పేలాయి. లక్షన్నరకుపైగా సైనికులు, యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాలను ఉక్రెయిన్‌కు మూడు వైపులా రష్యా మోహరించింది. మరోవైపు సంక్షోభ పరిష్కారానికి ఇరువురం సమావేశమవుదామని, అందుకు ప్రదేశాన్ని మీరే నిర్ణయించండని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జిలెన్స్కీ పిలుపునిచ్చారు. అయితే, దీనిపై రష్యా నుంచి ఇంకా స్పందన రాలేదు. ఉక్రెయిన్‌పై దాడికి రష్యా ‘ఫాల్స్‌ ఫ్లాగ్‌ ఆపరేషన్‌’ను ఉపయోగించుకునే అవకాశం ఉందనే ఆందోళనలు బలపడుతున్నాయి. మరోవైపు, ఫ్రాన్స్ అధ్యక్షుడు, పుతిన్ మధ్య దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘ భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరమే జో బైడెన్‌తో పుతిన్ శిఖరాగ్ర సమావేశం గురించి ప్రకటన వెలువడింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/aP4Klep

No comments:

Post a Comment