
బీహార్‌లోని మధుబని రైల్వేస్టేషన్‌లో శనివారం ఉదయం ఖాళీగా ఉన్న సంభవించింది. ఆగి ఉన్న రైల్లో మంటలు చెలరేగాయి. అన్ని బోగీలకు మంటలు వ్యాపించాయి. దాంతో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. దాంతో చుట్టూ పొగలు కమ్ముకున్నాయి. దీంతో రైల్వే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు మంటలను ఆర్పివేశామని అధికారులు వెల్లడించారు. "మధుబని రైల్వే స్టేషన్‌లో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ బోగీల్లో ఉదయం 9:50 గంటలకు మంటల చెలరేగాయి మంటలను ఆర్పివేశాము. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు" అని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో తెలిపారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు ట్రైన్‌లో ఎవరు లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. ఎవరికి గాయాలు కూడా కాలేదు. అయితే ఆగి ఉన్న రైల్లో మంటలు చుట్టుముట్టడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా గత నెలలో గాంధీధామ్ పూరీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నందుర్భార్ రైల్వే స్టేషన్‌కి ట్రైన్ రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలు ప్యాంట్రీ కారులో మంటలు అంటుకుని దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ట్రైన్‌లో మంటలను గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురై… కొంతమంది రైలు నుంచి దూకేశారు. దాంతో అధికారులు ట్రైన్ వెంటనే ఆపేశారు. సంబంధిత అధికారుల సమాచారంతో స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/mHLWSsE
No comments:
Post a Comment