మూడు వారాలుగా యుద్ధం కొనసాగిస్తున్న రష్యా.. ఉక్రెయిన్‌ను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రాజధాని నగరం కీవ్‌పై పట్టు సాధించడానికి రష్యా బలగాలకు ముచ్చెమటలు తప్పడంలేదు. ఉక్రెయిన్ సైనికుల నుంచి వారికి అనూహ్యంగా ప్రతిఘటన ఎదురవుతోంది. ముఖ్యంగా నైతిక, సరఫరా సమస్యలు వెంటాడుతున్నాయని పశ్చిమ దేశాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు, కీవ్‌కు రష్యా బలగాలు మరింత చేరువయినట్టు నివేదికలు అందుతున్నాయి. అటు, ఇరు దేశాలూ చర్చలు కొనసాగిస్తున్నాయి.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/aWe17iD
0 Comments