'లోకేష్ 23వ పులకేశిలాగా మారాడు.. కీచురాళ్ల రొదలా ఆ ట్వీట్లు ఏంటి': విజయసాయి

టీడీపీపై వైసీపీ ఎంపీ ట్వీట్ల దాడి కొనసాగుతోంది. చంద్రబాబు, లోకేష్‌లే టార్గెట్‌గా మరోసారి రెచ్చిపోయారు. రిటైర్మెంట్ సిండ్రోమ్ కారణంతో చంద్రబాబుతో పాటూ నేతలంతా వింతగా ప్రవర్తిస్తున్నారంటూ సెటైర్లు పేల్చారు. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను హిసించే రాజు 23వ పులకేసి అంటూ ఘాటు ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు, ఆయన శిష్య గణానికి ప్రతిదీ నెగెటివ్‌గా కనిపించడానికి ‘రిటైర్మెంట్‌ సిండ్రోమ్’ కారణం. పదవులు పోవడం, ప్రజలు పట్టించుకోకపోవడం, మొన్నటి వరకు ఇంద్రుడు, చంద్రుడు అని కీర్తించిన వారంతా అదృశ్యమవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తి ఉంటుంది. బయట పడటం అంత తేలికేమీ కాదు’అంటూ రెచ్చిపోయారు విజయసాయి. మరో ట్వీట్‌లో ‘చిత్తుగా ఓడి కూడా హింసించే రాజు 23వ పులకేశిలాగా లోకేష్ ప్రజలను టార్చర్‌ చేస్తున్నాడు. ఎన్నికలప్పుడు చేసిన చవకబారు విమర్శలనే మళ్లీ వదులుతున్నాడు. చంద్రబాబు కొడుకు కాబట్టి దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి మంత్రిగా మూడు శాఖలను భ్రష్టు పట్టించాడు. కీచురాళ్ల రొద లాగా ఏదేదో ట్వీటుతున్నాడు’అంటూ చురకలు అంటించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2SX6Ojc

Post a Comment

0 Comments