మూడేళ్ల చిన్నారిపై రేప్.. తల నరికేసి అత్యంత దారుణంగా హత్య

ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో అత్యంత ఘోర ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని అపహరించిన దుండగులు ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా హత్యచేశారు. టాటానగర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి గత గురువారం అపహరణకు గురైన మూడేళ్ల బాలిక మంగళవారం రాత్రి విగతజీవిగా కనిపించింది. టెల్కో ప్రాంతంలో తల లేకుండా ఉన్న పాప మొండాన్ని పోలీసులు ఓ ప్లాస్టిక్ కవర్లో కనుగొన్నారు. బాలిక తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొండాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బాలికను హత్య చేసే ముందు ఆమెపై పాశవికంగా అత్యాచార చేసినట్లు తేలింది. జననాంగాల వద్ద తీవ్ర రక్తస్రావమైందని, బాలిక తమను గుర్తిస్తుందేమో అన్న ఆందోళనతో నిందితులు ఆమెను చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికను ఎత్తుకెళ్తున్న సమయంలో అక్కడ రికార్డయిన సీసీ కెమెరా పుటేజీని పోలీసులు పరిశీలించారు. పాపను ఎత్తుకెళ్లింది పాత నేరస్థుడు రింకూ అని గుర్తించి అతడితో పాటు మరో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. అనేకమంది చిన్నారులను ఎత్తుకుపోయి అఘాయిత్యాలకు పాల్పడిన


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YIaKcY

Post a Comment

0 Comments