భాగ్యనగరం బోనమెత్తింది. పాతబస్తీలోని లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం(జులై 28) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం రాష్ట్రప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. తెల్లవారుజాము 4 గంటలకు బలిహరణ నిర్వహించగా, ఆరు గంటలకు మాజీ ఎంపీ టి.దేవేందర్‌గౌడ్ కుటుంబసభ్యులు అమ్మవారికి మహాభిషేకం, తొలి బోనం సమర్పించారు. అనంతరం మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి వీపీ సింధు బంగారు బోనం ఎత్తుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. లాల్‌దర్వాజా బోనాల్లో సినీనటి పూనమ్‌కౌర్ సందడి చేశారు. బోనమెత్తుకుని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్న ఆమె అమ్మవారికి బోనం సమర్పించి దర్శించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా పాతబస్తీలో అమ్మవారి ఆలయాలన్నీ కళకళలాడుతున్నాయి. వేలాది సంఖ్యలో మహిళలు బోనాలు సమర్పించేందుకు ఆలయాల వద్ద బారులు తీరారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Zm2DzS
0 Comments