శ్రీవారి దర్శనం చేసుకుని వెళ్తుండగా ప్రమాదం.. నలుగురి మృతి

శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న కారు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మద్దిపాడు మండలం గుండ్లపల్లివద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం మేడూరుకు చెందిన ఓ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు రెండ్రోజుల క్రితం తిరుమలకు వెళ్లారు. స్వామివారి దర్శనం చేసుకున్నాక శనివారం రాత్రి కారు డ్రైవర్‌తో కలిసి మొత్తం ఆరుగురు తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్నారు కారు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి పాల ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్‌ సాంబారెడ్డి(44)తో పాటు పాండురంగారావు(42), నరసింహారావు(40), సత్యసాగర్‌ (10) మృతి చెందారు. అనురాధ, సుప్రియ అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2GxenIq

Post a Comment

0 Comments