పీవీ ఘాట్ పక్కనే జైపాల్ అంత్యక్రియలు.. స్థలం పరిశీలించిన రేవంత్‌రెడ్డి

కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి మృతి ఆయన కుటుంబంతో రాజకీయ వర్గాల్లో విషాదం నింపింది. సీనియర్ నేత, ఉత్తమ పార్లమెంటేరియన్, సౌమ్యుడిగా పేరున్న జైపాల్‌రెడ్డి ఇకలేరన్న వార్త తెలిసి అందరూ షాకయ్యారు. ఉదయం లేవగానే ఇంతటి విషాదవార్తను వినాల్సి వస్తుందనుకోలేదంటూ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది నేతలు జైపాల్ నివాసానికి వచ్చి భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. రేపు మధ్యాహ్నం నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. నెక్లెస్‌రోడ్‌లోని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఘాట్ పక్కనే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి గాంధీ భవన్‌కు ఆయన భౌతికకాయాన్ని తరలించనున్నారు. పార్టీ శ్రేణుల సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంచి అనంతరం అంతిమయాత్ర చేపట్టనున్నారు. జైపాల్‌రెడ్డికి బంధువైన మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వీవీ ఘాట్ వద్ద అంత్యక్రియలకు స్థలాన్ని పరిశీలించేందుకు నేతలతో కలిసి వెళ్లారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/312vMjT

Post a Comment

0 Comments