జైపాల్‌రెడ్డి మృతిపట్ల కేసీఆర్, జగన్ సంతాపం

కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మృతిపట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైపాల్‌రెడ్డి మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జైపాల్‌రెడ్డి సేవలు చిరస్మరణీయమని, తెలంగాణ ప్రజలు గొప్ప రాజకీయ నేతను కోల్పోయారని పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డి మృతిపట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాజకీయాల్లో జైపాల్‌ లేని లోటు తీర్చలేదని అన్నారు. కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి మృతిపట్ల కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. జైపాల్‌రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జైపాల్ గొప్ప మానవతావాది అని కొనియాడారు. జైపాల్‌రెడ్డి మృతి వార్త తెలియగానే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన ఇంటికి తరలివస్తున్నారు. భౌతికకాయానికి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకుంటున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2K7aWJb

Post a Comment

0 Comments