రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరున్న కేంద్ర మాజీ మంత్రి మృతిపట్ల రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయిన జైపాల్‌కు అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలున్నాయి. మంచివక్త అయిన జైపాల్‌రెడ్డి పార్లమెంటులో మాట్లాడితే ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా ఆసక్తిగా వినేవారు. అందుకే ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యారు. 1969లో తరపున తొలిసారి మహబూబ్‌నగర్ కల్వకుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందిన జైపాల్‌రెడ్డి అక్కడి నుంచి మొత్తం నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 1977లో జనతాపార్టీలో చేరారు. 1980లో ఇందిరాగాంధీపై పోటీచేసి ఓడిపోయారు. 1984లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందిన జైపాల్‌రెడ్డి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1998, 1999, 2004, 2009 ఎన్నికల్లో ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన 1991-92 మధ్య కాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. ఐకే గుజ్రాల్ కేబినెట్లో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా, మన్మోహన్‌సింగ్ మంత్రివర్గంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2ZhQYSk
0 Comments