మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర విషాదం జరిగింది. వరినాట్ల కోసం వెళ్లి తిరిగొస్తూ.. 14 మంది మృత్యువాత పడ్డారు. పొట్టకూటి కోసం వెళ్లిన 14 మందిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో 14 మంది పాలయ్యారు. వీరిలో 10 మంది మహిళలు ఉండగా నలుగురు పురుషులు ఉన్నారు. ప్రమాదంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి కూడా మృత్యువాత పడటం గమనార్హం. మహబూబ్‌నగర్ రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలికి చేరుకున్న జిల్లా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బాధిత కుటుంబాల వారిని పరామర్శించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు. జిల్లా మిడ్జిల్ ప్రాంతంలోని కొత్తపల్లి గ్రామం వద్ద ఆదివారం (ఆగస్టు 4) సాయంత్రం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. చనిపోయిన వారంతా కొత్తపల్లితో పాటు గోగ్యా తండాకు చెందిన వారని అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయం కొత్తపల్లి నుంచి మిడ్జిల్ గ్రామంలో వరినాట్ల పనుల నిమిత్తం కొంత మంది కూలీలు వచ్చారు. సాయంత్రం నాట్లు ముగించుకున్న తర్వాత అందరూ కలిసి ఒకే ఆటోలో తమ తిరుగు ప్రయాణమయ్యారు. కల్వకుర్తి మెయిన్ రోడ్డు మీదికి ఆటో చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. చూస్తుండగానే రహదారి రక్తసిక్తమైంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు అయిపోయింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారయ్యాడు. కొత్తపల్లికి చెందిన మృతులు వివరాలు 1) సాలమ్మ (50) 2) వడ్డే చెన్నమ్మ (50) 3) కటికే బాలామని (45) 4) బండారి ఎల్లమ్మ (45) 5) రాగుల శివలీల (40) 6) చంద్రమ్మ (45) 7) బొల్లె పోగు వెంకటమ్మ (45) 8) బిచాని (40) 9) హెచ్ వెంకటమ్మ (35) గోగ్యా తండాకు చెందిన మృతులు 10) సేవ్యా (30) 11) చాంది (35) 12) శివాజీ నాయక్ (40) చాందీ, శివాజీ నాయక్ భార్యాభర్తలు కావడం గమనార్హం. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2MCwY9K
0 Comments