కదులుతున్న రైలులోనే మహిళా ఖైదీపై పోలీసు అత్యాచారం!

కదులుతున్న రైలులోనే తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ చేసిన ఆరోపణలతో హెడ్ కానిస్టేబుల్‌పై పోలీసులు రేప్‌ కేసు నమోదు చేశారు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో కిడ్నాప్ కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఓ మహిళ తీహార్ జైలులో ఉంటోంది. పశ్చిమ బెంగాల్‌లో కేసు విచారణ నిమిత్తం ఆగస్టు 1వ తేదీన పోలీసులు ఆమెను ఆ రాష్ట్రానికి తీసుకెళ్లారు. విచారణ పూర్తయ్యాక ఆగస్టు 3వ తేదీన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లు‌, ఓ హెడ్ కానిస్టేబుల్ బందోబస్తుతో ఆమెను తిరిగి ఢిల్లీ తీసుకొచ్చేందుకు రైలు ఎక్కించారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మహిళా ఖైదీ బాత్‌రూమ్‌కి వెళ్లాలనుకుంది. అయితే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు నిద్రపోతుండటంతో హెడ్ కానిస్టేబుల్‌ తాను తోడుగా వెళ్లాడు. ఆ సమయంలో హెడ్ కానిస్టేబుల్ తనను బెదిరించి రైలులోనే అత్యాచారం చేశాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే రైలులో నుంచి తోసేస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2TfmEFN

Post a Comment

0 Comments