జూదంలో భార్యను పణంగా పెట్టి.. ఓడటంతో గ్యాంగ్ రేప్, బతిమాలి మళ్లీ ..

తాగుడు, ఎంతటివారినైనా, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులనైనా పాతాళానికి దిగజారుస్తాయి అనడానికి నిదర్శనం ఈ ఘటన. జూదం, తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి ఏకంగా భార్యనే పణంగా పెట్టాడు. బెట్టింగ్‌లో ఓడటంతో.. తన స్నేహితులకు భార్యను అప్పగించాడు. దీంతో వారు ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. భర్తే ఇలా చేయడంతో ఆమె బాధతో మేనమామ ఇంటికెళ్లింది. తన వెనకే వచ్చిన భర్త మన్నించమని వేడుకోవడంతో మనసు మార్చుకొని వచ్చింది. దార్లోనే కారు ఆపి స్నేహితులను ఎక్కించుకున్న భర్త.. మరోసారి తన బుద్ధి బయటపెట్టుకోగా.. అతడి స్నేహితులు మరోసారి ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. భర్త తీరుతో ఇక ఏ మాత్రం ఉపేక్షించొద్దని భావించిన బాధితురాలు.. గోడు వెళ్లబోసుకోవడం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. కానీ ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆదేశాలతో.. జఫారాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాగుడుకు బానిసైన తన భర్త జూదం కోసం డబ్బులు లేకపోవడంతో తనను పందెంగా పెట్టాడని బాధితురాలు వాపోయింది. భర్త స్నేహితుడైన అరుణ్, అతడి బంధువు అనిల్ తరచుగా తమ ఇంటికొచ్చి మందు తాగుతూ జూదం ఆడతారని చెప్పింది. ఓ రోజు తన భర్త జూదం కోసం తనను పందెం కాశాడని.. ఓడటంతో.. అరుణ్, అనిల్ కలిసి తనను గ్యాంగ్ రేప్ చేశారని ఆరోపించింది. ఈ ఘటన తర్వాత ఆమె మేనమామ ఇంటికి వెళ్లింది. ఆమె వెనుకే అక్కడికి వెళ్లిన భర్త.. తనను మన్నించాలని కోరాడు. దీంతో మనసు మార్చుకున్న ఆమె భర్తతోపాటు కార్లో ఇంటికొచ్చింది. దార్లోనే కారు ఆపిన ఆ ప్రబుద్ధుడు.. ఆ స్నేహితులను కార్లో ఎక్కించుకున్నాడు. వారిద్దరూ మరోసారి ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. పోలీసులు తన గోడు వినకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు అక్షింతలు వేయడంతో.. పోలీసులు దారికొచ్చి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2yxn54N

Post a Comment

0 Comments