Jammu Kashmirకు స్వయం ప్రతిపత్తి.. ఆర్టికల్ 370 ముఖ్యాంశాలు

పుల్వామా ఉగ్రదాడిలో 49 మంది సైనికులు దుర్మరణం చెందడం సగటు భారతీయుణ్ని కలచి వేసింది. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ మేరకు సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా నమోదయ్యాయి. రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను సత్వరమే విచారించడానికి సుప్రీం కోర్టు సమ్మతించింది. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 గురించి ముఖ్య విషయాలు మీకోసం.. * జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం చేసిన ఏర్పాటే ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ వల్ల రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలకు వర్తించిన నిబంధనలేవీ జమ్మూ కశ్మీర్‌కు వర్తించవు. దీని ప్రకారమే 1965 వరకూ ఆ రాష్ట్రానికి సీఎం బదులు ప్రధాని, గవర్నర్ స్థానంలో ప్రెసిడెంట్ ఉండేవారు. * ఆర్టికల్ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. * ఈ ఆర్టికల్‌ను గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించారు. ఆయన అంతకు ముందు రాజు మహారాజా హరి సింగ్ వద్ద దివాన్‌గా పని చేశారు. * రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల వ్యవహారాలు మినహా మిగతా చట్టాల అమలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. * ఆర్టికల్ 370 ప్రకారం బయటి వ్యక్తులు జమ్మూ కశ్మీర్లో భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేయడం కుదరదు. Also Read: * యుద్ధం, విదేశీ దురాక్రమణ సమయంలోనే కేంద్రం ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించగలదు. అంతర్గత ఘర్షణలు తలెత్తినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేనిదే ఎమర్జెన్సీ విధించలేం. * జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ ఉన్నాయి. * రాష్ట ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. * జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి ఆరేళ్లు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Yldldq

Post a Comment

0 Comments