జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర హోం మంత్రి సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని షా కొనియాడారు. కారణంగానే జమ్మూ కశ్మీర్‌ను ప్రత్యేకంగా చూశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్నారు. జమ్మూ కశ్మీర్‌కు కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం తాత్కాలికమేనన్న అమిత్ షా.. పరిస్థితులు చక్కబడగానే మళ్లీ రాష్ట్రంగా మారుస్తామన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, చైనా అధీనంలో ఉన్న అక్సాయ్ చిన్ కూడా భారత్‌లో అంతర్భాగమన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఎలా స్వాధీనం చేసుకోవాలో తెలుసని హోం మంత్రి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 25 స్థానాలకూ ఎన్నికలు నిర్వహిస్తామని అమిత్ షా తెలిపారు. మోదీ ప్రభుత్వం ఎవరికీ తలొగ్గదన్న అమిత్ షా.. నెహ్రూ విధానం వల్లే పీవోకే భారత్ చేజారిందన్నారు. 1948లో భారత సేనలు పాకిస్థాన్ సైన్యాన్ని తరుముకుంటూ బాలోకోట్ వరకు వెళ్లాయి. కానీ ఇంతలోనే నెహ్రూ సర్కారు వెనక్కి రావాలని ఆదేశించింది. ఈ కారణంగానే పీవోకే మనకు కాకుండా పోయిందన్నారు. జమ్మూ కశ్మీర్ నుంచి బలగాలను వెనక్కి రప్పించబోమన్న హోం మంత్రి.. హురియత్ నేతలతో చర్చల ప్రసక్తే ఉండదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను ఎలా విభజించిందో అందరికీ తెలుసన్నారు. ఆ రోజు ప్రజాస్వామ్యంలో చీకటి రోజన్నారు. ఆర్టికల్ 371ను ఆర్టికల్ 370తో పోల్చొద్దన్నారు. ఏపీ, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలు ఈ విషయంలో ఆందోళన చెందనవసరం లేదన్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2OG2mqo
0 Comments