యువతి స్నానం చేస్తుండగా తొంగిచూసిన వాచ్‌మెన్

గెస్ట్‌హౌస్‌లో స్నానం చేస్తున్న యువతిని తొంగిచూస్తూ వికృత చేష్టలకు పాల్పడిన వాచ్‌మెన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న ఓ గెస్ట్‌హౌస్‌‌ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. బిజినెస్ పనిమీద వచ్చే ఎంతోమంది అతిథులు అక్కడ బస చేస్తుంటారు. ఇటీవల ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగ పని నిమిత్తం గురుగ్రామ్‌ వచ్చి ఆ గెస్ట్‌హౌస్‌లో పనిచేసింది. Also Read: ఆదివారం ఆ యువతి స్నానం చేస్తున్న సమయంలో బాత్‌రూమ్ కిటికీ వద్ద అలికిడి అయితే అటువైపు సడెన్‌గా చూసింది. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్ గురైంది. ఎవరో కిటికీలో నుంచి తనను చూస్తున్నట్లు గుర్తించి గట్టిగా కేకలు పెట్టగా దుండుగుడు పరారయ్యాడు. దీంతో బాధితురాలు గెస్ట్‌హౌస్ సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా ఆ దుండగుడు వాచ్‌మెన్ అని తేలింది. దీంతో సీసీ పుటేజీ ఆధారంగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాచ్‌మెన్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా మరెన్నో లీలలు వెలుగులోకి వచ్చాయి. Also Read: తాను గెస్ట్‌హౌస్‌కి వాచ్‌మెన్‌గా వచ్చినప్పటి ఇలా ఎంతో మంది మహిళలను చూశానని, కొందరిని తన సెల్‌ఫోన్‌తో వీడియో తీశానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. దీంతో అతడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు బాధిత మహిళల వివరాలు ఆరా తీస్తున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2O3TwRq

Post a Comment

0 Comments