వేధింపులు తట్టుకోలేక భార్యా భాధితుడి ఆత్మహత్య

భార్య, అత్త వేధింపులను భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పంజాబ్‌లోని మొహాలీలో జరిగింది. నగరానికి చెందిన జస్పీర్ సింగ్ అనే వ్యక్తికి రజనీ కౌర్ అనే యువతితో 2014లో వివాహమైంది. అయితే కొద్దిరోజులకు వారి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు రావడంతో విడిగా ఉంటున్నారు. రజినీ పుట్టింటికి వెళ్లిపోగా.. జస్పీర్ తల్లిదండ్రులతో కలిసి డేరాబస్సీలోని సజ్జాద్‌పూర్ర్ గ్రామంలో ఉంటున్నాడు. Also Read: ఈ నేపథ్యంలోనే జస్పీర్ సింగ్ బుధవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై మృతుడి బంధువు దీదార్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా డెరాబాస్సీ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో తన చావుకు కారణం భార్య, అత్త వేధింపులే కారణమని పేర్కొన్నాడు. కొన్నాళ్లుగా వారిద్దరు తనను తీవ్రంగా వేధిస్తున్నారని, అక్రమ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు. Also Read: సోమవారం విభేదాల పరిష్కారం కోసం మాట్లాడుకుందామని పిలిచి భార్య, అత్త తనను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా దాడికి పాల్పడ్డారని మృతుడు లేఖలో వెల్లడించాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2mc2JLX

Post a Comment

0 Comments