చెరలో ఉన్న కుల్ భూషణ్ జాదవ్ ఇప్పుడెలా ఉండి ఉంటారో ఊహించగలరా..? పోనీ ఏడాది క్రితం ఆయన భార్య, తల్లి కలిసినప్పుడు జాదవ్ ఎలా ఉన్నారో గుర్తుందా? ఆయన ముఖం చూడగానే.. పాకిస్థాన్ ఆర్మీ చేతిలో చిత్రవధకు గురైనట్టుగా అనిపించింది కదూ. ఆయన మాట్లాడిన ప్రతి మాటను పాక్ నిర్దేశించినట్టుగా, ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టుగా అనిపించింది. తాజాగా జాదవ్‌ను కలిసిన భారత డిప్యూటీ హై కమిషనర్ గౌరవ్ అహ్లువాలియా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాదవ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని స్పష్టం అవుతోందని అహ్లువాలియా తెలిపారు. ఏమాత్రం ఆమోదయోగ్యం కాని పాక్ వాదనలు సడలకుండా ఉండటం కోసం.. కట్టుకథలు చెప్పేలా జాదవ్‌పై దాయాది దేశం ఒత్తిడి తెస్తోందని విదేశాంగ శాఖ తెలిపింది. భవిష్యత్తులో ఏం చేయాలనే విషయాన్ని భారత అధికారుల నుంచి పూర్తి నివేదిక వచ్చాకే నిర్ణయిస్తామని తెలిపింది. జాదవ్‌కు న్యాయం జరిగేలా చూస్తామని, అతణ్ని భారత్‌కు తీసుకొస్తామని విదేశాంగ తెలిపింది. జాదవ్ తల్లితో విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు. జాదవ్‌తో భారత అధికారి మాట్లాడిన విషయాన్ని ఆమెకు తెలిపారు. కుల్‌భూషణ్ జాదవ్‌ను ఇరాన్ నుంచి పాకిస్థాన్ అక్రమంగా అపహరించింది. 2017 ఏప్రిల్‌లో పాక్ మిలిటరీ కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది. కానీ ఈ నిర్ణయాన్ని భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేయగా.. ఉరి శిక్షను నిలిపేయాలని, జాదవ్‌కు భారత దౌత్య అధికారులను కలిసే అవకాశం ఇవ్వాలని ఐసీజే ఆదేశించింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2NG3kRs
0 Comments