Pawan Kalyan Birthday: ఫ్యాన్స్‌ను తరిమి, కేకును కాళ్లతో తొక్కిన వైస్ ప్రిన్సిపాల్.. కులం చిచ్చు!

సెప్టెంబర్ 2న జనసేన అధినేత జన్మదినం సందర్భంగా.. ఆయన అభిమానులు అప్పుడే సంబరాలు ప్రారంభించారు. తమ అభిమాన నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలతో జనసైనికులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. సెప్టెంబర్ 2న వినాయకచవితి సెలవు దినం కావడంతో.. ఏపీలోని చాలా ఇంజినీరింగ్ కాలేజీల్లో ఆయన బర్త్ డే సెల్రబేషన్స్ జరిపారు. తాడేపల్లిగూడెంలోని శశి విద్యాసంస్థల ఎదురుగా కొందరు అభిమానులు పవన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించారు. ఇందుకోసం చందాలు వేసుకొని 25 కిలోల కేక్ కొనుగోలు చేశారు. కానీ బర్త్ డే కేక్ కట్ చేయకుండా శశి ఇంజినీరింగ్ కాలేజీ వైస్ చైర్మన్ నరేంద్రనాథ్ మేకా పవన్ ఫ్యాన్స్‌ను అడ్డుకున్నారు. కేక్‌ను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పవన్ ఫ్యాన్స్‌ను అక్కడి నుంచి పంపించేశారు. నరేంద్ర మేకా తీరును నిరసిస్తూ.. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు రోడ్డు మీద బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో వారికి ఆయన క్షమాపణలు చెప్పారు. తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశాన్ని కాలేజీ ఫేస్‌బుక్ పేజీ ద్వారా నరేంద్ర మేకా వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు, భావాలకు తాను విరోధిని కానన్న నరేంద్ర మేకా.. ఆయన జన్మదిన వేడుకల్లో విద్యార్థులే కాకుండా బయట వ్యక్తులు కూడా వచ్చారన్నారు. మూడు రోజులు సెలవు కావడంతో హాస్టల్‌లో ఉండే ఆడపిల్లలను తీసుకెళ్లడం కోసం వాళ్ల తల్లిదండ్రులు వచ్చారని.. వారి ముందు కాలేజీకి చెడ్డ పేరు వస్తుందనే భావనతోనే తాను కొంత అత్యుత్సాహం ప్రదర్శించానని ఆయన అంగీకరించారు. ఆ కేక్‌ను తోసేయకుండా దాచిపెట్టి తర్వాత ఇవ్వాల్సిందన్నారు. చేసిన దానికి ఆయన పశ్చాతాపం వ్యక్తం చేశారు. Read Also: తాను ఏ కులానికి వత్తాసు పలికే వాడిని కాదన్న నరేంద్ర మేకా.. పవన్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పడమే కాకుండా.. జనసేనాని పుట్టిన రోజున తానే కేక్ తెప్పించి విద్యార్థులతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తానని తెలిపారు. ఈ వేడులకు తమ కాలేజీ విద్యార్థులు, తాము ఆహ్వానించే జనసేన నాయకులు మాత్రమే ఆహ్వానితులని ఆయన స్పష్టం చేశారు. అంతకు ముందు పరిటాల రవి జయంతి సెలబ్రేషన్స్‌ను ఇక్కడే నిర్వహించారని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలను జరుపబోతే అడ్డుకున్నారని జనసేనాని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2HEqN1D

Post a Comment

0 Comments