కామాంధులు రెచ్చిపోతున్నారు. వావీవరసలు, తనమన లేకుండా నీచానికి దిగజారుతున్నారు. ఫ్రెండ్ భార్యపై కన్నేసిన ఓ కామాంధుడు కామకోరికలు తీర్చాలంటూ వేధింపులకు గురిచేసిన అమానుష ఘటన తాజాగా వెలుగుచూసింది. ఆమె ఫోన్‌కి న్యూడ్ ఫొటోలు, మెసేజ్‌లు పంపిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. విషయం స్నేహితుడికి తెలిసిపోవడంతో కటకటాలపాలయ్యాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది. చించ్వాడ్ ఏరియా పింప్రికి చెందిన మహిళ(47) భర్తతో కలసి ఉంటోంది. ఆమెపై కన్నేసిన భర్త స్నేహితుడు కామకోరికలు తీర్చాలంటూ వేధింపులకు గురిచేశాడు. ఆమె సెల్‌ఫోన్‌కి అసభ్యకర న్యూడ్ ఫొటోలు, మెసేజ్‌లు పంపించి వికృతానందం పొందేవాడు. ఆమె మేనకోడలి ఫోన్‌కి సైతం అసభ్యకర ఫొటోలు పంపించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. Also Read: ఈ నెల 7న అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లు పంపించాడు. వాటిని చూసిన ఫ్రెండ్ భార్య డిలీట్ చేసేసింది. అంతటితో ఆగని కామాంధుడు మరోసారి న్యూడ్ ఫొటోలు పంపించడంతో పాటు కోరిక తీర్చాలంటూ అసభ్యకర మెసేజ్‌లు పంపించాడు. విసిగిపోయిన ఆమె విషయాన్ని భర్తకి చెప్పడంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Read Also:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Y5z4nJ
0 Comments