విశాఖలో యువతి మృతి.. శరీరంపై సిగరెట్ వాతలు.. వ్యభిచార కోణంపై అనుమానాలు

విశాఖ నగరంలోని అక్కయ్యపాలెంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. 22 ఏళ్ల దివ్య అనే యువతి ఫిట్స్‌తో చనిపోయినట్లు ప్రచారం చేసి ఓ మహిళ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకువస్తున్నట్టు జ్ఞానాపురంలోని శ్మశానవాటిక కాపరికి ఫోన్‌ చేసి చెప్పింది. అయితే అనుమానమొచ్చిన కాటికాపరి పోలీసులకు సమాచారమిచ్చి ఆమెకు ట్విస్ట్ ఇచ్చాడు. మృతదేహంపై గాయాలు, సిగరెట్‌తో వాతలు పెట్టిన ఆనవాళ్లు వుండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టానికి తరలించారు. Also Read: విశాఖలోని అక్కయ్యపాలెంలోని చెక్కుడురాయి బిల్డింగ్ సమీపంలో నివాసముంటున్న గుట్టల వసంత అనే మహిళకు కొంతకాలం క్రితం వివాహమైంది. ఆమె భర్త ఉపాధి నిమిత్తం దుబాయిలో ఉండటంతో ఆమె ఒంటరిగా నివసింతోంది. ఆర్నెల్ల క్రితం ఆమెకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన దివ్య(22) అనే యువతితో పరిచయమైంది. దీంతో ఆ యువతి అప్పటి నుంచి వసంత ఇంట్లోనే ఉంటోంది. గురువారం ఉదయం దివ్య ఫిట్స్‌తో చనిపోయిందంటూ వసంత తన బంధువులకు సమాచారమిచ్చింది. దీంతో అందరూ ఆమె ఇంటికి చేరుకుని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే ముందురోజు వరకు బాగానే యువతి సడెన్‌ చనిపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చినా ఎవరూ పోలీసులకు చెప్పే ధైర్యం చేయలేకపోయారు. Also Read: అయితే దివ్య అంత్రక్రియలు నిర్వహించేందుకు వసంత బంధువులు జ్ఞానాపురంలోని శ్మశానవాటిక కాటికాపరికి సమాచారం అందించారు. మృతురాలి వివరాలన్నీ తీసుకున్న కాటికాపరికి 22 ఏళ్ల మహిళ ఫిట్స్‌తో చనిపోవడం నమ్మశక్యంగా అనిపించలేదు. దీంతో వెంటనే విశాఖ ఫోర్త్ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు వెంటనే వసంత ఇంటికి చేరుకుని దివ్య మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై అనేక చోట్ల గాయాలుండటం, వీపు భాగంలో సిగరెట్‌ వాతలు పెట్టిన ఆనవాళ్లు ఉండటం, జుట్టు కూడా కత్తిరించి ఉండటంతో పోలీసులు వెంటనే క్లూస్‌ టీమ్‌, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వసంతతో పాటు ఆమె సోదరి మంజులను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు. పోలీసులు ఈ కేసును వ్యభిచార కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వ్యభిచారం చేసేందుకు అంగీకరించకపోవడం వల్లే దివ్యను చిత్రహింసలు పెట్టి చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3gUUA6b

Post a Comment

0 Comments