బిడ్డను కనడం ఇష్టం లేని గర్భిణి అఘాయిత్యానికి పాల్పడింది. అబార్షన్‌కు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదన్న ఆక్రోశంతో ప్రాణాలొదిలేందుకు సిద్ధపడింది. కడుపులో బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. విషం తాగి బలవన్మరణానికి యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన జిల్లా మదనపల్లెలో వెలుగుచూసింది. కురబలకోట మండలం మట్లివారిపల్లెకి చెందిన మధుకర్‌కి అదే ప్రాంతానికి చెందిన జ్యోతి(23)తో వివాహమైంది. వారికి ఏడాదిన్నర పాప ఉంది. ఇటీవల జ్యోతి మరోసారి గర్భం దాల్చింది. ప్రస్తుతం మూడో నెల. అయితే బిడ్డని కనడం ఇష్టం లేని ఆమె అబార్షన్‌కి యత్నించింది. అది తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా మందలించారు. Also Read: అబార్షన్ ఒప్పుకోలేదన్న కోపంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. పొలం వద్ద జిల్లేడు పాలు తీగేసింది. కడుపులో బిడ్డతో సహా బలవన్మరణానికి యత్నించింది. జిల్లేడు పాలు తాగినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను తక్షణం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. Read Also:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3eRMYzn
0 Comments