జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌లో ఫెయిలవడంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామానికి చెందిన భీమవరపు సైదారావు కుమార్తె స్నేహలత ఇంటర్ చదువుతోంది. ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఆమె ఫెయిలైంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయానని మనస్థాపానికి గురైన స్నేహలత బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగేసింది. కొద్దిసేపటికే ఆమె మరణించింది. విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పరీక్షల్లో ఫెయిలైనందుకు ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2C6Vson
0 Comments