లడఖ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో భారత ఆర్మీ కల్నల్, ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. లడఖ్‌లోని గాల్వాన్ లోయలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. చైనా వైపు కూడా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 1975 తర్వాత చైనా, భారత సైన్యాల మధ్య ఈ స్థాయిలో ఘర్షణ చోటు చేసుకోవడం ఇదేే తొలిసారి కావడం గమనార్హం. భారత సైన్యానికి చెందిన కల్నల్ సహా ముగ్గురు మరణించడంతో.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఇరుదేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. భారత సైన్యం మధ్యాహ్యం రెండు గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. ఇటీవల లడఖ్ సరిహద్దుల్లో చైనా భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించగా.. ప్రతిగా భారత్ కూడా సైన్యాన్ని మోహరించింది. ఇరు దేశాల సైనికులు గత కొద్ది వారాలుగా ఒకరికొకరు ఎదురు నిలిచారు. దీంతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఇటీవలే ఇరు దేశాలు లడఖ్ నుంచి బలగాలను ఉపసంహరించాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే వెనక్కి మళ్లాలని సూచించిన భారత సైన్యంపై చైనా సైనికులు దాడికి పాల్పడ్డారని సమాచారం.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Yxc9k8
0 Comments