ఇటీవల కాలంలో టిక్‌టాక్ వ్యవసంగా మారుతోంది. అనేకమంది వీడియోలు తీస్తూ ఏకంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. మరికొందరైతే వన్యప్రాణులను హింసిస్తూ టిక్‌టాక్ వీడియోలు తీస్తూ చిక్కుల్లో పడుతున్నారు. ఇదే కోవలో ఉడుము మాంసంతో కూర ఎలా వండాలో వివరిస్తూ టిక్‌టాక్ చేసిన యువకుడిని ఫారెస్ట్ అధికారులు అరెస్టు చేశారు. ఉడుమును పట్టుకుని దాని మాంసంతో కూర వండి తింటూ ఓ యువకుడు చేసిన టిక్‌టాక్ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. Also Read: దీనిపై జిల్లా అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టి ఆ యువకుడిని తిరుచ్చి జిల్లా మేకుడి గ్రామానికి చెందిన వరదరాజ్(24)గా గుర్తించారు. దీంతో శనివారం సాయంత్రం అతడిని అరెస్టు చేశారు. కుందేలు, జింక, నక్క, ఉడుము వంటి వన్యప్రాణులను వేటాడటం చట్టరీత్యా నేరమని, అది తెలిసి కూడా కొందరు వాటిని వేటాడుతున్నారని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో వన్యప్రాణులను వేటాడటం, వాటి మాంసాన్ని వండుకుని తినడాన్ని కూడా వీడియోగా తీసి సోషల్‌మీడియాల వైరల్ చేయడం దారుణమన్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2N0VCjj
0 Comments